Posts

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

Image
తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చితకబాదటానికి హీరోగారు ఆఖరినిమిషంలో బయలుదేరటం సర్వసాధారణం. అలా బయలుదేరటానికి సదరు హీరోగారు వాడే వాహనాలు రెండే రెండు. గుర్రం లేదా 'బుల్లెట్' మోటార్ సైకిల్. ఆయన వాటిల్లో ఏదో ఒకదానిని తీసుకుని బయలుదేరగానే ఫ్రంట్ బెంచర్స్ ఉత్సాహానికి అంతు ఉండదు. హాలంతా ఈలలతో దద్దరిల్లిపోవాల్సిందే. అలా 'బుల్లెట్' మోటార్ సైకిల్ కు సినిమాఫీల్డ్ తో అవినాభావ సంబంధముంది.To Read full story, Click Here

కోదండరామ్ పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా!

Image
ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని - సగటు తెలుగు కమర్షియల్ సినిమాలలో హీరోలాగా - ఒంటిచేత్తో కేసీఆర్, ఆయన నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ సాధించుకొచ్చినట్లు ఎవరైనా అంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఈ రెండున్నరేళ్ళుగా కేసీఆర్ టైమ్ బాగుండటంతో ఆయనను ఇంద్రుడు, చంద్రుడు, అసహాయశూరుడు, మేరునగధీరుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నవారు(ఈ గొర్రెలమందలో ఈమధ్య కొందరు ఆంధ్రోళ్ళుకూడా చేరటం ఒక విశేషం) ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఘనతలో కేసీఆర్ కృషి మూడోవంతు మాత్రమే.To Read Full Story, Click Here.

సీఈఓ బాబుగారు ఈవెంట్ మేనేజర్ స్థాయికి పడిపోయారెందుకు!

Image
ప్రస్తుతం ఉన్నస్థితినుంచి మెరుగైన స్థితికి వెళ్ళాలనుకోవటం మానవ నైజం. మరి మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారేమిటి దీనికి రివర్సులో వెళుతున్నారు. నాడు 1995 నుంచి 2004 వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా దాదాపు పదేళ్ళు పాలించిన బాబుగారు ఏపీకి తాను సీఈఓనని అప్పట్లో చెప్పుకున్న సంగతి తెలిసిందే(కార్పొరేట్ సంస్కృతిపట్ల ఆ మోహంలో రెచ్చిపోయి వ్యవసాయం దండగ అనటమే ఆయన కుర్చీకిందకు నీళ్ళు తేవటం వేరే విషయమనుకోండి). మరి పదేళ్ళతర్వాత గద్దెనెక్కిన ఆయనకు ఇప్పుడేమయిందోగానీ ఈవెంట్ మేనేజర్ స్థాయికి దిగిపోయారు.To Read Full Article, Click Here.

కోడెల సంచలన వ్యాఖ్యలపై నేషనల్ మీడియాలోనూ చర్చ!

Image
వంటింటికి పరిమితమైతేనే ఆడవాళ్ళకు మంచిదనే అర్థంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్థానికంగా రెండు తెలుగురాష్ట్రాలలో పెద్ద ప్రభావం కనిపించకపోయినా జాతీయస్థాయిలో మాత్రం అవి పెద్ద దుమారాన్నే లేపాయి. మహిళాసంఘాల నేతలు, వివిధ రాజకీయపార్టీల నాయకులు కోడెలపై నిప్పులు చెరుగుతున్నారు.To Read Full story Click Here.

'వంగవీటి' కాదు 'దేవినేని' అంటున్నారు!

Image
ఎల్లప్పుడూ ప్రజల నోళ్ళలో నానుతూ సంచలనంగా ఉండాలని కోరుకునే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం వంగవీటి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. కోస్తా ఆంధ్ర రాజకీయాలలో, అదీ బెజవాడలో ఎవరూ మరిచిపోలేని నాయకుడు వంగవీటి మోహనరంగా కథ ఆధారంగా తీస్తున్న చిత్రం కావటంతో ఇది మొదటినుంచీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కోస్తాలోని రెండు ప్రధాన కులాలకు సంబంధించిన సబ్జెక్ట్ అయినందున అంత సున్నితమైన అంశాన్ని వర్మ ఎలా డీల్ చేస్తాడా అని అందరిలో ఆసక్తి నెలకొంది. చిత్రం స్క్రిప్టు తయారీలో భాగంగా వర్మ రెండుసార్లు విజయవాడవెళ్ళి ఇరు వర్గాలనూ కలుసుకున్నారు. ఆయనకు దేవినేని సహకరించినప్పటికీ వంగవీటి కుటుంబం మాత్రం సానుకూలంగా స్పందించలేదు. దానికి కారణం వర్మ నిర్మాణంలో గతంలో రూపొందిన 'బెజవాడ' చిత్రంలో దేవినేని వర్గాన్నే హీరోగా చూపించటమేనని టాక్ వినబడింది. పూర్తి కథనం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గౌతమీపుత్ర: క్రిష్ కాపీ నైపుణ్యానికి పరాకాష్ఠ!

Image
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ఇవాళ్టికి యూట్యూబ్ లో 40 లక్షల వ్యూస్ సంపాదించి టాలీవుడ్ లో రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సరికొత్త రికార్డు ఆవిష్కరణ సందర్భంగా నందమూరి అభిమానులు సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. అయితే రెండు నిమిషాల 20 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఇప్పుడు సినిమాపండితుల మధ్య చర్చనీయాంశమయింది. ఈ కథనం పూర్తిగా చదవటానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

రెడ్‌మి, లెనోవా ఫోన్‌లు అంతచౌకగా ఎలా అమ్ముతున్నారో తెలుసా!

Image
రెడ్‌మి(షియామి), లెనోవా, జియానీ, లీకో, హ్వావేయ్(హువావే అని కూడా పిలుస్తారు), కూల్‌ప్యాడ్ వంటి చైనా కంపెనీల మొబైల్ ఫోన్‌ల మోడల్స్ భారత్‌లో అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోతున్న సంగతి తెలిసిందే. మంచి కాన్ఫిగరేషన్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఉన్న పవర్‌ఫుల్ ఫోన్లను శాంసంగ్, సోనీ, ఎల్‌జీ, హెచ్‌టీసీ వంటి బడా కంపెనీల ఫోన్ల ధరలలో మూడోవంతుకే అందిస్తుండటంతోనే పైన పేర్కొన్న చైనా కంపెనీల ఫోన్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా రెడ్‌మి సంస్థ ఫోన్‌లు భారతీయుల హృదయాలను కొల్లగొట్టి వారి జేబుల్లో తిష్ఠవేసుకుని కూర్చున్నాయి. రెడ్‌మి నోట్ 3, రెడ్‌మి 3ఎస్, రెడ్‌మి 3 ప్రైమ్ మోడల్స్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మొబైల్ ఫోన్లుగా ఇటీవల రికార్డులకెక్కాయి. ఈ మోడల్స్‌లోని స్పెసిఫికేషన్స్‌తోనే శాంసంగ్, సోనీ, ఎల్‌జీ కంపెనీల ఫోన్లను కొనాలంటే మూడింతలు ఎక్కువ డబ్బు పెట్టాల్సిఉంటుంది(రెడ్‌మి రెండేళ్ళ క్రితం తయారుచేసిన మోడల్స్‌లో స్నాప్ డ్రాగన్ 400, స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్‌ను వాడగా, అదే ప్రాసెసర్‌లతో తయారుచేసిన మోడల్స్‌ను శాంసంగ్ ప్రస్తుతం 15-20 వేల రేంజిలో అమ్ముతోంది). మరి ఈ చైనా కంపెనీలు ఇంత కారుచౌకగా ఎలా అమ…