Skip to main content

Posts

Showing posts from November, 2010

జగన్ దారి...పెడదారా?

2004 లో...కాంగ్రెస్  అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ళ‌లో ముఖ్యమంత్రి  రాజ‌శేఖ‌ర‌రెడ్డిని...మా వోయిస్టుల ప‌ట్ల మీ వైఖ‌రి ఎలా ఉండ‌బోతోంద‌ని మీడియావారు అడిగితే – సిసలైన క్రైస్తవుడిలాగానే ఆయన బైబిల్ లోని ఓ కథను ఉటంకిస్తూ, వాళ్ళు ' ప్రోడిగ‌ల్ స‌న్స్ '(పెడ దోవ ప‌ట్టిన పిల్ల‌లు) అని అన్నారు. మావోయిస్టుల సంగ‌తేమిటోగానీ , సాక్షాత్తూ ఆయ‌న‌ కుమారుడే ప్రోడిగ‌ల్ స‌న్‌ అయ్యాడనే అభిప్రాయం కలుగుతోంది. తండ్రి చనిపోయిననాటినుంచీ జగన్ వ్యవహారశైలిని గమనిస్తే అది సవ్యంగా ఉందని అనిపించడంలేదు. మరి అతని స్వభావమే అంతో, లేక చెప్పుడుమాటలు వింటున్నాడో తెలియదుగానీ తప్పుదోవ పట్టాడనిపిస్తోంది. ఇప్పుడు రాజీనామా చేయడంవలన పార్టీకి ఎంతోకొంత నష్టం చేయగలడు....కానీ, అతనికి ఒరిగేదేమిటి ? గరిష్ఠంగా... అయితే గియితే -  ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతాడు. కానీ అతనేం బావుకుంటాడు... ? అతనికి సొంతపార్టీ పెట్టి నడిపేటంత సామర్ధ్యముందా... ?(అర్ధబలముందిగానీ...దిశానిర్దేశం చేసేటంత అనుభవజ్ఞులు,  రాజనీతిజ్ఞులు,  వ్యూహకర్తలెవరూ అతనిపక్కన కనిపించడంలేదు).  ఇంత జరిగాక కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఊరుకుంటాయా...? భా

చ‌ర‌ణ్‌కు తొలి చేదు(నారింజ‌) అనుభ‌వం రుచి చూపించిన భాస్క‌ర్

పాపం చ‌ర‌ణ్‌...చిరుత, మ‌గ‌ధీరవంటి విజయాల త‌ర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఆలోచించి...చించీ...చించీ(ఆరెంజ్‌కు ముందు చ‌ర‌ణ్ ఎంతో మ‌థ‌న‌ప‌డ్డాడ‌ని  చిరంజీవి ఆ ఆడియో విడుద‌ల ఫంక్ష‌న్‌లో చెప్పారు) మూడోసినిమాకు - ప్రేమ‌క‌థ‌ను, ద‌ర్శ‌కుడిగా భాస్క‌ర్‌ను ఎంచుకుంటూ అతను తీసుకున్న నిర్ణయం మిస్‌ఫైర్ అవ్వ‌డం విచార‌క‌రం. అయితే దీనిలో చ‌ర‌ణ్ త‌ప్పేమీ లేద‌ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక‌టే ఇమేజ్‌లో ఇమిడిపోకుండా వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాలు చేస్తూ అటు మాస్‌ను, ఇటు క్లాస్‌ను మెప్పించాల‌నుకోవ‌డం మంచి ఆలోచ‌నే. కానీ అత‌ని ఆలోచ‌న‌ను ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ స‌రిగా execute చేయ‌లేక‌పోయాడు. క‌థ‌లో, క్యారెక్ట‌రైజేష‌న్‌లో లోపాల వ‌ల‌న సినిమా అటు క్లాస్‌నుగానీ, ఇటు మాస్‌నుగానీ ఆక‌ట్టుకోలేక‌పోతోంద‌ని విమ‌ర్శ‌కులంద‌రూ ముక్త‌కంఠంతో చెబుతున్నారు. క‌థ‌కు మంచి పాయింటునే తీసుక‌న్న భాస్క‌ర్, దానిపై ఇంకా బాగా క‌స‌ర‌త్తు చేసి, ఆ త‌ర్వాత‌ సినిమా రూపొందిస్తే బాగుండేది. తీసుకున్న పాయింటును జ‌స్టిఫై చేసే సీన్లు లేవ‌ని అంద‌రూ అంటున్నారు. మ‌రీ క్లాస్‌గా, ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో ఉంచుకుని తీసే బాలీవుడ్ ల‌వ్‌స్టోరీలాగా ఉంద‌న్న వా

చంద్ర‌బాబు, రామోజీరావు జీర్ణించుకోలేని పరిణామం

అవును నిన్నటి సీఎమ్ మార్పు వ్య‌వ‌హారం వాళ్ళిద్ద‌రికీ అస్స‌లు మింగుడుప‌డ‌ని ప‌రిణామమని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ త‌ర్వాత‌...వాళ్ళిద్ద‌రూ కాంగ్రెస్‌లో  తీవ్రంగా ద్వేషించే వ్య‌క్తి కిర‌ణ్ కుమార్‌రెడ్డి. అటువంటి వ్య‌క్తి ఇవాళ సీఎమ్ అవుతున్నాడంటే వాళ్ళిద్ద‌రికీ నిన్న‌రాత్రి నిద్రకూడా పట్టిఉండదు. అస‌లు వీళ్ళిద్ద‌రికీ - కిర‌ణ్‌కూ గొడ‌వేమిట‌నుకుంటున్నారా...! కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఒక ఏగ్రెసివ్ కాంగ్రెస్ నాయ‌కుడు. 2004లో అధికారంలోకి రాక‌మునుపు, వ‌చ్చిన త‌ర్వాత కూడా తెలుగుదేశంమీద ఎటాక్‌ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో గ‌ట్టివ్య‌క్తి ఎవ‌ర‌ని చూస్తే... కిర‌ణ్‌కుమార్ రెడ్డే ముందుండేవారు. గాంధీభ‌వ‌న్‌లో, సీఎల్పీలో జ‌రిగే ప్రెస్‌మీట్‌ల‌లో ఆయ‌న విమ‌ర్శ‌లు ధాటిగా ఉండేవి. "చంద్ర‌బాబునాయుడూ... ఇదేమిటి, అదేమిటి..." అంటూ ఏక‌వ‌చ‌న సంబోధ‌న‌తోనే కొట్టిన‌ట్లు మాట్లాడేవారు. అసెంబ్లీలో కూడా కిర‌ణ్‌ టీడీపీని బాగా ఎదుర్కొనేవారు. దీంతో చంద్రబాబునాయుడు కిరణ్‌కుమార్ ఉనికిని కూడా సహించలేకపోయేవారు.  దరిమిలా 2004తర్వాత కిరణ్ వైఎస్‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. అసెంబ్లీలో ప్రతిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు కిర‌ణ్ స్పంద‌న‌ను ప్ర‌

బీహార్ ఫలితాలు: మళ్ళీ నితీష్‌కే కుర్చీ, లాలూకి గడ్డి, రాహుల్‌కు చెయ్యి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కే ప్రజలు మళ్ళీ పట్టం కట్టినట్లు దాదాపుగా స్పష్టమవుతోంది. జేడీయూ-బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు బీహార్‌ను పదిహేనేళ్ళపాటు అప్రతిహతంగా పాలించిన లాలూకు(పశుగ్రాసం కుంభకోణాన్ని అక్కడి జనం మరిచిపోలేదనుకుంటా...!) మరోసారి ఘోర పరాభవం ఎదురయింది. లాలూ-పాశ్వాన్ కూటమిని బీహార్ ప్రజలు తిరస్కరించారు. అటు రాహుల్ కరిష్మా కూడా బీహార్లో పనిచేయలేదు. ఆయనకు ప్రజలు చెయ్యిచ్చారు.  కాంగ్రెస్‌ రెండంకెలకు చేరుకోవడం కూడా కష్టమయ్యేటట్లుగా ఉంది. నితీష్ చేసిన అభివృద్ధే ఆయనకు విజయం సాధించిపెట్టింది. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, సుదీర్ఘంగా పెండింగులో ఉన్న వంతెనల నిర్మాణాలను చేపట్టడం, నేరాలసంఖ్యను తగ్గించడం, లక్షమంది టీచర్లను నియమించడం, వైద్యులు తప్పనిసరిగా ప్రాధమిక విద్యాకేంద్రాలలో పనిచేయాలని నిబంధన పెట్టడం వంటి చర్యల వలన నితీష్‌కు ప్రజాదరణ లభించింది. దానికితోడు ఆయన వ్యూహాత్మకంగా...ఈ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ అల్లర్లకేసు నిందితుడయిన ముఖ్యమంత్రి నరేంద్రమోడిని(సంకీర్ణ భాగస్వామ్యపక్షానికి చెందిన ముఖ్యనేత అయినప్పటికీ) 

రామోజీ రావ్...మాటలు జాగ్రత్త!

 ఈనాడులో ఇవాళ "మాటలు జాగ్రత్త!" శీర్షికతో వచ్చిన వార్తలో తప్పులు చిత్తగించండి. కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ప్రతిరోజూ సుమారు 5,000 ఫోన్లను ట్యాప్ చేస్తున్నాయి(రహస్యంగా వింటున్నాయి) అన్నది ఒక వార్త. దానిపై ఈనాడు మెయిన్ ఎడిషన్ మూడో పేజిలో "మాటలు జాగ్రత్త" అనే శీర్షికతో ఇచ్చిన వార్తలో... 'ట్యాపింగ్‌'కు బదులుగా 'ట్యాంపరింగ్' అని వచ్చింది. పోనీ ఏదో ఒకచోట అయితే...ఏదో పొరపాటున, అజాగ్రత్తవలన న్యూస్ డెస్క్ వారు చూసి ఉండకపపోవచ్చు అని అనుకోవచ్చు. హెడ్డింగ్‌లో ఒకసారి, కింది వార్తలో నాలుగుసార్లు 'ట్యాంపరింగ్' అనే మాట ప్రచురితమయింది. ఆవార్తను చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి  http://www.eenadu.net/story.asp?qry1=19&reccount=23 అంటే ట్యాపింగ్‌కు, ట్యాంపరింగ్‌కు తేడా తెలియని సబ్ ఎడిటర్ ఈ వార్తను రాశాడన్న మాట. సరే...మరి ఆ వార్తను సరిదిద్దిన డెస్క్ ఇన్ ఛార్జి అనే శాల్తీ ఏం చేస్తున్నట్లో? ట్యాంపరింగ్ అంటే ఫలితాన్ని తారుమారు చేయడం...ఆటోమీటర్లను ట్యాంపరింగ్ చేస్తారు, ఈవీఎమ్ లను ట్యాంపరింగ్ చేస్తారు. టెలిఫోన్లను ట్యాంపరింగ్ చేయడమంటే బిల్లులను తారుమారు చేయడమో ల

ఇ-మెయిల్‌ను తలదన్నే సరికొత్త క‌మ్యూనికేష‌న్ టూల్‌ను ఆవిష్కరించిన ఫేస్‌బుక్

క‌మ్యూనికేష‌న్ల‌రంగంలో ఒక‌ న‌వ‌శకానికి ఫేస్‌బుక్ నాంది ప‌లికింది. పోస్టుద్వారా ఉత్త‌రాలు పంపుకోవ‌డాన్ని ఇ మెయిల్ దాదాపు క‌నుమ‌రుగు చేయ‌గా, ఇప్పుడు దానిని త‌ల‌ద‌న్నే కొత్త ఉత్ప‌త్తిని ఫేస్‌బుక్ రూపొందించింది. దాదాపు అర‌బిలియ‌న్(50కోట్లు)మంది స‌భ్యులుగా ఉన్న సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ - ఫేస్‌బుక్...ఇ-మెయిల్, ఎస్ఎమ్ఎస్‌, చాట్‌, సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వంటి వివిధ క‌మ్యూనికేష‌న్‌ల‌ను మేళ‌వించి ఒక కొత్త ఉత్ప‌త్తిని తీసుకొచ్చింది. ఫేస్‌బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ జుక‌ర్‌బెర్గ్, స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ఆండ్రూ బోస్‌వ‌ర్త్ నిన్న‌(సోమ‌వారం, 15.11.10) అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో(సిలికాన్‌వ్యాలీ)లో ఈ కొత్త ఉత్ప‌త్తి గురించి ప్ర‌క‌టించారు.(త‌మ కొ్త్త ఉత్ప‌త్తి ఇన్‌ఫార్మ‌ల్‌గా ఉంటుంద‌ని చెప్ప‌డానికి కావ‌చ్చు...వారిద్ద‌రూ ఇన్‌ఫార్మ‌ల్‌గా టి ష‌ర్టులు, జీన్స్ వేసుకుని మీడియా ముందుకొచ్చారు) ఇ-మెయిల్ చేయ‌డం ఒక పెద్ద లాంఛ‌నంగా ఉంద‌ని, స‌బ్జెక్టు రాయ‌డం, సీసీ, బీబీ వంటి ఖాళీల‌ను నింప‌డం...ఇదంతా ఒక పెద్ద ప్ర‌క్రియ‌గా చేయాల్సివ‌స్తోంద‌ని మార్క్ జుక‌ర్‌బెర్గ్ అన్నారు. చాలా మంద‌కొడిగా, నెమ్మ‌దిగా ఉండే ఈ ఇ-మెయ

అమెరికా ఆధిపత్యం తగ్గిందని అంగీకరించిన ఒబామా...భారత్ వరల్డ్ పవర్ గా ఎదిగిందని ప్రశంశలు

ఒకనాడు ద్విథృవంగా(అమెరికా, రష్యా)ఉన్న ప్రపంచం, సోవియట్ రష్యా(యూఎస్ఎస్ఆర్) పతనం పుణ్యమా అని ఏకధృవప్రపంచమైపోవడంతో పెద్దన్నపాత్ర తీసుకున్న అమెరికా...గత 30ఏళ్ళుగా చేస్తూవస్తున్న కర్రపెత్తనానికి కాలం చెల్లే పరిస్థితి దగ్గరకు వచ్చినట్లేఉంది. అమెరికా ఆధిపత్యం సడలిందని ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా అంగీకరించారు. అఫ్ కోర్స్...ఆయన చెప్పింది ఆర్ధికపరంగా అనుకోండి.(డబ్బు లేకపోతే ఎవరు లెక్క చేస్తారు?) భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు అనూహ్యరీతిలో ఎదుగుతుండటం తమ ఆర్ధికవ్యవస్థకు సవాలుగా మారిందని ఒబామా నిన్న ముంబాయిలో చెప్పారు. అయితే ఆ దేశాలకు గట్టిపోటీనిస్తామని గాంభీర్యం ప్రదర్శించారు. భారత్ కు హైటెక్ ఎగుమతులపై ఆంక్షలు తొలగించడంపై తనకు, తన ప్రజలకు సర్ది చెప్పుకున్నారు. వాణిజ్యమంటే ఒక్కవైపునుంచే జరగదని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని అన్నారు. మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అమెరికా ప్రజలకు ఆయన ఈ వివరణ ఇచ్చుకున్నట్లు కనబడుతోంది. భారత్ ఎదుగుతున్న శక్తి కాదని, ఇప్పుడది అంతర్జాతీయశక్తి అని ఒబామా అన్నారు. ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ను సందర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ తో స్నేహసంబంధాలను మరింత

ఒబామాకు నిరసనలు తెలిపేందుకు సిద్ధమైన లెఫ్ట్ పార్టీలు-అతిథిని ఆదరించాలన్న శ్రీశ్రీశ్రీ రవిశంకర్

ఇవాళ ముంబాయిలో దిగుతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నిరసనలు తెలిపేందుకు సీపీఐ, సీపీఎమ్, ఫార్వార్డ్ బ్లాక్ తదితర వామపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఐదుగంటలకు ముంబాయిలోని చర్చిగేట్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. మరోవైపు ఎల్లుండి ఒబామా భారత్ లో అధికారిక కార్యక్రమాలలో పాల్గొననున్నందున...ఆ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించబోతున్నారు. తీవ్రవాదంపై పోరులో...ముఖ్యంగా 2008 నవంబర్ 26నాటి ముంబాయి పేలుళ్ళ సూత్రధారి డేవిడ్ హెడ్లీని భారత ప్రభుత్వానికి అప్పజెప్పడానికి...అమెరికా ఏమాత్రం సాయపడటంలేదని, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో కీలక నిందితుడు యూనియన్ కార్బైడ్ మాజీ అధినేత వారెన్ ఆండర్సన్ ను భారత ప్రభుత్వానికి అప్పజెప్పడానికి కూడా అమెరికా సహకరించడంలేదని వామపక్షనేతలు ఆరోపిస్తున్నారు. అమెరికాకు అనుకూలమైన ఆర్ధిక, విదేశాంగ విధానాలను అనుసరించేలా భారత్ పై ఒత్తిడి చేస్తోందని కూడా వారి ఆరోపణ. మరోవైపు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ గురూజీ శ్రీశ్రీశ్రీ రవిశంకర్...ఇది తగదంటూ లెఫ్ట్ పార్టీలను వారిస్తున్నారు. ఒబామా భారతదేశానికి వస్తున్న అతిధి అని, అతిధులన

చరణ్‌కంటే పెద్దదైన జెనీలియాను కాకుండా ఆరెంజ్‌లో ఎవరైనా ఫ్రెష్‌ఫేస్‌ను తీసుకోవాల్సింది

ఆరెంజ్ ప్రోమోలు చూస్తుంటే జెనీలియాలో ఫ్రెష్ లుక్ కనిపించడంలేదు. ముఖం బాగా డ్రెయిన్ అయిపోయినట్లు కనిపిస్తోంది. అఫ్ కోర్స్ సినిమా మొత్తంలో అలా ఉండకపోవచ్చు. కానీ ఫ్రెష్ ఫేస్ ఎవరినయినా తీసుకోవాల్సింది(like Samantha). దానికి తోడు వయసురీత్యా కూడా చరణ్ కంటే జెనీలియా రెండేళ్ళు పెద్దది కావడంతో అది కూడా స్పష్టంగా తెలిసిపోతోంది(చరణ్ కు 25ఏళ్ళయితే, జెనీలియాకు 27 ఏళ్ళు). చరణ్ కు ఇది మూడో సినిమా అయితే జెనీలియాకు ఇది ముప్పై ఒకటో ముప్పై రెండో సినిమానో. ఫారెన్ బ్యాక్ గ్రౌండ్ లో ఇలా కావాలి అని చరణ్ చెప్పిన ఔట్ లైన్ మేరకు కథను తయారుచేసుకున్నానని, హీరోయిన్ పాత్రకు జెనీలియాయే సరైన ఛాయిస్ అని ఆమెను తీసుకున్నామని దర్శకుడు భాస్కర్ చెబుతున్నాడు. ఆరెంజ్ పాటలు మొదటిసారి పెద్దగా అనిపించకపోయినా వింటున్న కొద్దీ బాగుంటున్నాయి. అయితే వీటిలో ఒక్క డ్యూయెట్ కూడా లేకపోవడం విశేషం. డ్యూయెట్ లేకుండా రొమాంటిక్ సినిమా ఏమిటో...కొత్తగా ఉంది. ఇక భాస్కర్ ఈ సినిమాకు చాలా ఎక్కువ ఖర్చు పెట్టించాడని, మెగా బ్రదర్స్ దీనిపై అసంతృప్తిగా ఉన్నారని వెబ్ సైట్లలో పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిజల్ట్ బట్టి చరణ్ ఛాయిస్ కరెక్టా

అమెరికా ఉత్పత్తుల అమ్మకాలను పెంచడం కోసమే భారత పర్యటన:కుండ బద్దలు కొట్టిన ఒబామా

చరిత్రాత్మక భారత పర్యటన వెనకున్న అసలు లక్ష్యమేమిటో ఒబామా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ముంబాయికి బయలుదేరేముందు వైట్ హౌస్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో తన పర్యటన పరమార్ధాన్ని ఆయన స్వయంగా వివరించారు. భారత్ మార్కెట్ లో అమెరికా ఉత్పత్తుల అమ్మకాలను మరింత పెంచడంపైనే తాను ఈ పర్యటనలో దృష్టి కేంద్రీకరించబోతున్నానని, పలు కార్పొరేట్ ఒప్పందాలు చేసుకోబోతున్నానని తెలిపారు. రాబోయే ఐదేళ్ళలో అమెరికా ఎగుమతులను రెట్టింపు చేయాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అమెరికాలో ఉద్యోగం కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లభించేదాకా తాను సంతృప్తి చెందబోనని తెలిపారు. అమెరికా ఉత్పత్తులకు మార్కెట్ పెరిగితే దేశంలో ఉపాధి దానంతట అదే పెరుగుతుందని, తద్వారా నిరుద్యోగం తగ్గిపోతుందని వివరించారు. అసలు విషయమేమిటంటే మార్పు నినాదంతో అమెరికా గద్దనెక్కిన ఒబామా అక్కడి ప్రజలకు ఎలాంటి మార్పూ చేసి చూపలేకపోయారు. దానికి తోడు ఆర్ధిక వ్యవస్థను కూడా ఏమాత్రం కోలుకునేటట్లు చేయలేకపోయారు...నిరుద్యోగ సమస్యనూ తగ్గించలేకపోయారు. దీనితో ఆయనకు ప్రజాదరణ క్రమక్రమంగా తగ్గుతూ వస్తూ నిన్నటి మధ్యంతర ఎన్నికలనాటికి తీవ్రంగా దిగజారిపోయింద

24గంటల వ్యవధిలో మూడు చోట్ల విమాన ప్రమాదాలు...89మంది మృతి

నిన్న ఉదయంనుంచి ఇవాళ ఉదయం వరకూ ప్రపంచవ్యాప్తంగా మూడు వేర్వేరుచోట్ల విమానప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మూడింటిలోనూ పెద్దదైన క్యూబా ప్రమాదంలో 68మంది చనిపోయారు. ఈ ఉదయం క్యూబా ఉత్తర ప్రాంతంలోని శాంటియాగో డి క్యూబా రాష్ట్రంనుంచి దేశరాజధాని హవానాకు వెళుతున్న ఏరోకరిబియన్ విమానయాన సంస్థ విమానం మార్గమధ్యంలో కూలిపోయింది. దీనిలో 40మంది క్యూబన్లు ఉండగా 28మంది విదేశీయులు ఉన్నారు. ప్రమాద కారణం ఇంకా తెలియలేదు. ఇక పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీలో జరిగిన రెండో ప్రమాదంలో 21మంది చనిపోయారు. ఒక ఆయిల్ కంపెనీ అద్దెకు తీసుకున్న విమానంలో తమ ఉద్యోగులను కొందరిని సింధ్ రాష్ట్రంలోని చమురు క్షేత్రాలకు తీసుకెళ్ళడానికి కరాచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అవగానే విమానంలోని ఒక ఇంజన్ లో మంటలు రేగాయని పైలట్ కంట్రోల్ టవర్ కు తెలిపాడని, వెంటనే గ్రౌండ్ చేయడానికి ప్రయత్నిస్తుండగానే పేలిపోయిందని అధికారులు తెలిపారు. లోపలి మనుషుల దేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ప్రమాద కారణం తెలియలేదు. పాకిస్తాన్ లో గత 4నెలల్లో ఇది రెండో విమాన ప్రమాదం. జులై 28న ఇస్లామాబాద్ శివార్లలో జరిగిన ప్రమాదంలో 152మంద

'డెస్టినేషన్ మ్యారేజ్' చేసుకుందామనుకున్న అల్లు అర్జున్...కాదన్న అరవింద్!

స్నేహరెడ్డితో అల్లు అర్జున్ పెళ్ళి వార్తలు మొత్తంమీద నిజమేనని తేలింది. అల్లు అరవింద్ స్వయంగా ఈ వార్తను మీడియాకు ప్రకటించారు. అయితే అది అరేంజ్డ్ మ్యారేజా లేక లవ్ మ్యారేజా అన్నదానిమీద ఇంకా స్పష్టత రాలేదు. అరవింద్ మాత్రం ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పడానికి ప్రయత్నించారు. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే వేరే కులంలో అమ్మాయిని ఎందుకు చేసుకుంటున్నట్లో(అరవింద్ కాపు కులానికి చెందినవారు)! పెళ్ళి ఏర్పాట్ల గురించి చెబుతూ...కొద్దిమంది బంధుమిత్రులతో ఎక్కడికైనా వెళ్ళి డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుని వచ్చి హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఇద్దామని బన్నీ అన్నాడని అరవింద్ తెలిపారు(జనానికి దూరంగా బ్యాంకాక్, మారిషస్ లేదా రాజస్థాన్ వంటిచోట్ల ఉండే ఏదైనా మంచి రమణీయ ప్రదేశానికి వెళ్ళి పెళ్ళి చేసుకోవడమే డెస్టినేషన్ మ్యారేజ్). అయితే ఆ ప్రపోజల్ ను తాను వ్యతిరేకించినట్లు అరవింద్ తెలిపారు. పెళ్ళి నిర్వహణ ఆడపెళ్ళివారిది కాబట్టి వారి ఇష్టాన్నిబట్టి పోవాలని తాను బన్నీకి చెప్పినట్లు వెల్లడించారు. పెద్దకొడుకు(అర్జున్ కంటే పెద్దవాడు)కు తన కులంలోని అమ్మాయితోనే పెళ్ళి చేసిన అరవింద్...బన్నీకి మాత్రం కులాంతర వివాహం చేయాల్సి

ఒబామా నెత్తిన బోండాం పడింది

ఈవారం చివరలో భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా...తన పర్యటనలో భాగంగా ముంబాయి సందర్శించనున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన పర్యటించబోయే కొన్ని స్థలాలలో కొబ్బరిచెట్లు ఉండటంతో వాటి బోండాలు అధ్యక్షుని నెత్తిమీద పడతాయేమోనని భద్రతాసిబ్బంది ఆ చెట్లకున్న బోండాలను, కొబ్బరిమట్టలను కొట్టించేశారని ఇవాళ న్యూస్ పేపర్‌లలో వచ్చింది. అయితే అక్కడ అమెరికాలో ఇవాళ నిజంగానే ఒబామా నెత్తిమీద కొబ్బరి బొండాం పడినంత పనయింది. అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఒబామాకు, ఆయన పార్టీ 'డెమోక్రాట్'కు, అక్కడి ప్రజలు మాడు పగిలిపోయేలా టెంకజెల్ల ఇచ్చారు. దిగువ సభ - హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ లో 'డెమోక్రాట్'పై ప్రత్యర్ధి పార్టీ 'రిపబ్లికన్' గణనీయమైన ఆధిపత్యం సాధించింది. ఎగువ సభ - సెనేట్ లో కూడా రిపబ్లికన్స్ మునపటికంటే లాభపడ్డప్పటికీ, అక్కడ డెమోక్రాట్స్ మెజారిటీ కొనసాగడంతో ఒబామాకు చావుతప్పి కన్ను లొట్టపోయినట్లయింది. అటు వివిధ రాష్టాల గవర్నర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో కూడా రిపబ్లికన్స్ ఆధిపత్యం సాధించారు. డెమోక్రాట్లకు గత 70ఏళ్ళలో ఎన్నడూ లేనివిధంగా ఓటమి ఎదురయింది. రెండేళ్ళక్రితం అనూహ్యరీతి