Skip to main content

Posts

Showing posts from 2011

ఇంత దద్దమ్మ నాయకత్వమా మన దేశాన్ని పాలిస్తోంది?

అన్నాహజారే ఉదంతం – కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ మరియు యూపీఏ నాయకత్వంలోని డొల్లతనాన్ని కళ్ళకుగట్టింది. ఇక్కడ, 'అన్నా' వాదన కరెక్టా - కేంద్రప్రభుత్వ వాదన కరెక్టా అనేదాని గురించో (లేక) అవినీతి నిర్మూలనలో లోక్‌పాల్ బిల్ ఎంత సమర్ధమంతం అనేదాని గురించో చర్చించబోవడంలేదు. 'అన్నా'విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరించిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ ఎంత అవివేకంగా ఉందనేది చర్చనీయాంశం. రెండు తప్పుడు నిర్ణయాలు(డిసెంబర్ 9నాటి తెలంగాణా ప్రకటన, జగన్‌ను సరిగా టేకిల్ చేయలేకపోవడం) తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పటికే రావణకాష్ఠంలాగా మార్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని మించిన ఒక చరిత్రాత్మక తప్పిదానికి పాల్పడి నడిబజారులో పరువు పోగొట్టుకుంది. నిరవధిక నిరాహారదీక్షకు కూర్చోబోతున్న 'అన్నా'ను, నియంతృత్వ ధోరణిలో కొద్దిగంటలముందు అరెస్టు చేయించింది. ఒక్కసారి దేశమంతా భగ్గుమంది. ప్రజలు వెల్లవలా బయటకొచ్చి 'అన్నా'కు మద్దతుగా నిలబడి ప్రభుత్వంపై నిప్పులుగక్కారు. అప్పటికిగానీ పరిస్థితి అర్ధంగాని ప్రభుత్వం కాళ్ళబేరానికొచ్చింది. 'అన్నా' బృందంతో బేరసారాలు మొదలుపెట్టి చివరికి వా

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

పదిరోజుల వ్యవధిలో(జాతి మొత్తం ఏకమై నిలిచిన) రెండు చరిత్రాత్మక సందర్భాలు

గత పదిరోజులుగా దేశానికి ఏదో మంచి దశ నడుస్తున్నట్లుంది. లేకపోతే కుల, మత, వర్గ, ప్రాంత, సంస్కృతుల విబేధాలు, వైషమ్యాలతో రగిలే భరతజాతి మొత్తం ఒక్కసారికాదు, రెండుసార్లు ఏకతాటిపైకి రావడమంటే మాటలా. ఈ అరుదైన శుభపరిణామాలకు నాంది పలికింది ఒకసారి క్రికెట్టయితే, రెండోసారి అవినీతిపై పోరు. ప్రపంచకప్ సందర్భంగా జరిగిన సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ ల సందర్భంగా జాతిమొత్తం, ఆసేతుహిమాచలమూ భారతజట్టు గెలుపుకోసం తపన చెందింది. పిల్లలు, యువతీయువకులు సరే...క్రికెట్ ఆటను పెద్దగా పట్టించుకోనివారు, పెద్దవారు, ఆడవాళ్ళు సైతం ఈ రెండు మ్యాచ్ ల సందర్భంగా మనదేశ జట్టుగెలవాలని బలంగా ఆకాంక్షించారు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా. ఈ రెండు మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో దేశమంతటా - కర్ఫ్యూ కాదుగానీ - 144వ సెక్షన్ విధించినట్లయిందని చెప్పుకోవచ్చు. అందరూ టీవీసెట్లకు అతుక్కుపోయారు. రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. మొత్తానికి 120కోట్లమంది ప్రార్ధనలు ఫలించాయో ఏమోగానీ భారతజట్టు ఆ రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించి ప్రపంచ కప్ సాధించి జాతిని ఆనందసాగరంలో ఓలలాడించింది. జనం తమ సమస్యలను, కష్టాలను, విబేధాలను పక్కనబెట్టి

మూర్తీభవించిన స్త్రీత్వం సుజాత

ఒద్దిక, అణకువ, సుకుమారం, లాలిత్యం, బిడియం, అపురూపం వంటి సున్నితమైన, స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన భావాలకు ప్రతిరూపంగా సుజాతగారిని చెప్పొచ్చు. అసలు ఆమెలో ప్రత్యేకత ఏమిటంటే...సున్నితభావాలతోబాటు ఆత్మాభిమానం, గాంభీర్యం, హుందాతనం పరిణతి, స్పష్టత, మానసికధృడత్వం, ఖచ్చితత్వం(ఎసర్టివ్ నెస్) వంటి భావాలను కూడా ఆమె బ్రహ్మాండంగా పలికించేవారు. మిరుమిట్లుగొలిపే అందం కాకపోయినా స్ఫురద్రూపం. మంచి ఎత్తు, చక్కటి కనుముక్కుతీరు. మాతృభాష మళయాళం కాగా, తెలుగులోనే డైలాగులు చెప్పడంకోసం మన భాషను కూడా నేర్చుకున్నారు. మొదట్లో చౌకబారు(మళయాళీ) సినిమాల్లో నటించినప్పటికీ తర్వాత, తర్వాత తనకు తాను ఒక ఇమేజ్ ఏర్పరుచుకుని దానికే కట్టుబడిఉండటం గొప్పవిషయం(ఫీల్డులో నిలబడటంకోసం దాదాపుగా ప్రతి టాప్ హీరోయిన్ కూడా మొదట్లో చౌకబారు వేషాలు వేసినవారే). తెరమీదలాగానే, తెరవెనక కూడా ఒద్దికగా, అణకువగా ఉండే ఆమె సహజ స్వభావంవలనో, అదృష్టంవలనోగానీ, సుజాతగారికి మంచి మంచి పాత్రలు లభించాయి. ముఖ్యంగా అవళ్ ఒరు తొడర్ కథై(అంతులేనికథ), అన్నక్కిళి(రామచిలుక), అవర్ గళ్(ఇది కథకాదు), గుప్పెడుమనసు, గోరింటాకు, సుజాత(ఈ సినిమాలో ద్విపాత్రాభినయం) వంటి చిత్రా

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లయిన 'శక్తి'

నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'శక్తి' విడుదలవడం...మొదటి షో నుంచే నిర్ద్వంద్వంగా ఫ్లాప్ టాక్ రావడం వెంటవెంటనే జరిగిపోయాయి. నిజంగా నందమూరి అభిమానులకు ఇది ఆశనిపాతమే. ఒక టాప్ హీరో సినిమాకోసం అతని అభిమానులు రోజుల తరబడి కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తుంటారు. అది ఫ్లాపయితే వాళ్ళు... తమ హీరో కంటే ఎక్కువ బాధపడతారు. మళ్ళా తర్వాత సినిమాకోసం ఎదురు చూపులు మొదలుపెడతారు. అందుకనే అగ్రహీరోలు సినిమాలను ఒప్పుకునేటప్పుడు తమ విచక్షణతోబాటు అభిమానుల ఆశలను, అంచనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తెలుగు సినిమా పరిశ్రమలో ముందున్న రికార్డులకంటే 50-60% అధికంగా కలెక్షన్లు వసూలు చేసి(సాధారణంగా ఇది 10-15% ఉంటుంది), కనీవినీ ఎరగని రికార్డులను స్థాపించిన 'మగధీర'ను తలదన్నే సినిమా చేయాలని ఎన్టీఆర్ కన్న కలలను దర్శకుడు మెహర్ రమేష్ కాలరాశాడు. నిర్మాత అశ్వనీదత్ ఇచ్చిన వనరులను, అవకాశాన్ని సద్వినియోగం చేయలేకపోయాడు(బడ్జెట్ ఎంతో చెబితే ఆ మొత్తాన్ని రమేష్ ఖాతాలో డిపాజిట్ చేస్తానని సినిమా ప్రారంభానికి ముందే దత్ చెప్పాడట). మగధీరను చూసి శక్తి స్టోరీ తయారు చేసుకున్నాడు(ఈయనగారు చేసిన మొదటి సినిమా-కంత్రీ మరో

అమెరికా విద్యార్ధికి ఒక్కరికైనా భారత్‌లో ఇలా జరిగితే ఊరుకునేవారా?

చింత చచ్చినా పులుపు చావనట్లు...ఆర్ధిక వ్యవస్థ కుదేలైపోయి అగ్రరాజ్య హోదా పోగొట్టుకునే దశలో ఉన్నా, అమెరికా ఇంకా దురహంకార వైఖరిని విడనాడడంలేదు. ఇంకా తమకొకన్యాయమూ, ఎదుటివారికొక న్యాయమన్నట్లుగానే వ్యవహరిస్తోంది. మెక్సికో గల్ఫ్ లో చమురు లీకేజికిగానూ BP ఆయిల్ కంపెనీనుంచి చెవులు మెలిపెట్టి మరీ నష్టపరిహారం కట్టించిన అంకుల్ శామ్...భోపాల్ గ్యాస్ బాధితులకు నష్టపరిహారం విషయంలో మాత్రం సెలెక్టివ్ అమ్నీషియా(మతిమరుపు)ను తెచ్చిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల భారత పర్యటనలో మనదేశాన్ని, సమకాలీన పరిస్థితులలో ప్రపంచంలో మనదేశ ప్రాధాన్యతను ఆకాశానికెత్తేస్తూ మాట్లాడి, అమెరికాఉత్పత్తుల అమ్మకాలకోసం వేలకోట్లరూపాయల వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్ళిన ఒబామాకు, ట్రైవ్యాలీ యూనివర్సిటీ చేతిలో మోసపోయిన భారతీయ విద్యార్ధుల విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం లేదా? ఆ భారతీయ విద్యార్ధులంతా అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చివేత వంటి విధ్వంసరచనకు వెళ్ళిన ఉగ్రవాదులో, లేకపోతే మెక్సికోతీరంనుంచి పోలీసుల కళ్ళుగప్పి అక్రమంగా చొరబడే వలసదారులో కాదుకదా. అలా వెళ్ళిన సంఘ వ్యతిరేకశక్తులను పట్టుకోలేని చేతకాని ప్రభుత్వం ఈ పె

వెన్నుచూపి పారిపోనందుకు మొత్తానికి చిరుకు మంచి ప్రతిఫలమే దక్కేటట్లుంది

వ్రతం చెడ్డా ఫలం దక్కడమంటే ఇదేనేమో. మొత్తానికి ముఖ్యమంత్రి కాలేకపోయినా చిరంజీవికి ఏదో గౌరవప్రదమైన స్థానం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఒకానొక సమయంలో చిరంజీవి తన పార్టీని రద్దు చేసేస్తారని, మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోతారని పుకార్లు జోరుగా వినిపించాయి. ప్రజారాజ్యం దుకాణం బంద్ అని, పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తారని మీడియాలో...ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలలో కొంతకాలంగా ఎన్నో కథనాలు వచ్చాయి. దానికి తగ్గట్లుగా తెలంగాణాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు(అనిల్, మహేశ్వరరెడ్డి) ఉన్నా లేనట్లే. రాయలసీమలోని ఇద్దరు ఎమ్మెల్యేలు(శోభానాగిరెడ్డి, కాటసాని) జగన్ వర్గంలో చేరిపోయారు. ఇక ఉన్న 14మందిలో కూడా నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి కూడా జగన్ వర్గంమనిషే. ఇక నికరంగా చూస్తే 13మంది ఉన్నట్లు. ఒక విషయంలో చిరుని మెచ్చుకోవాలి. రాష్ట్రంలో అంత భారీస్థాయిలో ఆసక్తిరేపుతూ సంచలనాత్మకంగా రాజకీయాల్లోకి వచ్చి, తీరా ఎన్నికల్లో తుస్సుమన్న తర్వాత – ఎవరయినా ఛీ మనకెందుకు ఈ రొచ్చు అని వెనక్కి పారిపోయి ఉండేవారేమో(వెనకకు వెళితే సినిమాఫీల్డులో మరో ఐదారేళ్ళు కెరీర్ కొనసాగించే అవకాశాలున్నాయి కాబట్టి). అయితే ఆ పనిచేయక

యాపిల్ తెలుగు కీబోర్డ్ వాడేవారికి ఒక మంచి చిట్కా

యాపిల్ తెలుగు కీబోర్డ్ అలవాటు ఉన్నవారికి కొత్తగా కంప్యూటర్‌లో ఆ సెటప్ పెట్టుకోవడానికి సాధారణంగా రెండు మార్గాలను అనుసరిస్తున్నాం. 1) అనూ ఫాంట్స్ సాఫ్ట్ వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవడం.(ఇది యూనికోడ్ కాదు) 2) వీవెన్ గారు రూపొందించిన కీబోర్డ్ లేఔట్‌ను నెట్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయడం. అనూ ఫాంట్స్ ఇన్‌స్టాల్ చేయాలంటే దానిని కొననైనా కొనాలి...లేదా పైరసీ వెర్షన్ అయినా తీసుకోవాలి. అందుకనే యాపిల్ కీబోర్డ్ వాడేవారం ఎక్కువగా వీవెన్ గారి సాఫ్ట్ వేర్ వాడుతున్నాం. అయితే దీనిలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి. ‘ఇన్‌స్టాల్‘ అనే పదం కంపోజ్ చేయాలంటే ఇన్ స్టాల్ అని మధ్యలో గ్యాప్ ఇచ్చి కంపోజ్ చేయవలసి వస్తోంది. అలాగే ‘జ్ఞాన‌ము’ అనే పదములో ఉన్న మొదటి అక్షరం కంపోజ్ చేయడానికి వీలుకావడంలేదు. ఇదేకాక మనం మన ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా(నెట్ సెంటర్‌లోగానీ, వేరే సిస్టమ్‌లోగానీ) తెలుగులో కంపోజ్ చేయాలంటే తెలుగు సాఫ్ట్ వేర్ అక్కడ అందుబాటులో ఉండటం అరుదు. పై సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం ఉంది. దీనిగురించి మీకు తెలిస్తే సరే. తెలియకపోతే కింద చూడండి. తెలుగు కీబోర్డుల గురించి నెట్‌లో బ్రౌజ్ చేస్తుండగా నా