Skip to main content

Posts

Showing posts from April, 2011

పదిరోజుల వ్యవధిలో(జాతి మొత్తం ఏకమై నిలిచిన) రెండు చరిత్రాత్మక సందర్భాలు

గత పదిరోజులుగా దేశానికి ఏదో మంచి దశ నడుస్తున్నట్లుంది. లేకపోతే కుల, మత, వర్గ, ప్రాంత, సంస్కృతుల విబేధాలు, వైషమ్యాలతో రగిలే భరతజాతి మొత్తం ఒక్కసారికాదు, రెండుసార్లు ఏకతాటిపైకి రావడమంటే మాటలా. ఈ అరుదైన శుభపరిణామాలకు నాంది పలికింది ఒకసారి క్రికెట్టయితే, రెండోసారి అవినీతిపై పోరు. ప్రపంచకప్ సందర్భంగా జరిగిన సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ ల సందర్భంగా జాతిమొత్తం, ఆసేతుహిమాచలమూ భారతజట్టు గెలుపుకోసం తపన చెందింది. పిల్లలు, యువతీయువకులు సరే...క్రికెట్ ఆటను పెద్దగా పట్టించుకోనివారు, పెద్దవారు, ఆడవాళ్ళు సైతం ఈ రెండు మ్యాచ్ ల సందర్భంగా మనదేశ జట్టుగెలవాలని బలంగా ఆకాంక్షించారు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా. ఈ రెండు మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో దేశమంతటా - కర్ఫ్యూ కాదుగానీ - 144వ సెక్షన్ విధించినట్లయిందని చెప్పుకోవచ్చు. అందరూ టీవీసెట్లకు అతుక్కుపోయారు. రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. మొత్తానికి 120కోట్లమంది ప్రార్ధనలు ఫలించాయో ఏమోగానీ భారతజట్టు ఆ రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించి ప్రపంచ కప్ సాధించి జాతిని ఆనందసాగరంలో ఓలలాడించింది. జనం తమ సమస్యలను, కష్టాలను, విబేధాలను పక్కనబెట్టి

మూర్తీభవించిన స్త్రీత్వం సుజాత

ఒద్దిక, అణకువ, సుకుమారం, లాలిత్యం, బిడియం, అపురూపం వంటి సున్నితమైన, స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన భావాలకు ప్రతిరూపంగా సుజాతగారిని చెప్పొచ్చు. అసలు ఆమెలో ప్రత్యేకత ఏమిటంటే...సున్నితభావాలతోబాటు ఆత్మాభిమానం, గాంభీర్యం, హుందాతనం పరిణతి, స్పష్టత, మానసికధృడత్వం, ఖచ్చితత్వం(ఎసర్టివ్ నెస్) వంటి భావాలను కూడా ఆమె బ్రహ్మాండంగా పలికించేవారు. మిరుమిట్లుగొలిపే అందం కాకపోయినా స్ఫురద్రూపం. మంచి ఎత్తు, చక్కటి కనుముక్కుతీరు. మాతృభాష మళయాళం కాగా, తెలుగులోనే డైలాగులు చెప్పడంకోసం మన భాషను కూడా నేర్చుకున్నారు. మొదట్లో చౌకబారు(మళయాళీ) సినిమాల్లో నటించినప్పటికీ తర్వాత, తర్వాత తనకు తాను ఒక ఇమేజ్ ఏర్పరుచుకుని దానికే కట్టుబడిఉండటం గొప్పవిషయం(ఫీల్డులో నిలబడటంకోసం దాదాపుగా ప్రతి టాప్ హీరోయిన్ కూడా మొదట్లో చౌకబారు వేషాలు వేసినవారే). తెరమీదలాగానే, తెరవెనక కూడా ఒద్దికగా, అణకువగా ఉండే ఆమె సహజ స్వభావంవలనో, అదృష్టంవలనోగానీ, సుజాతగారికి మంచి మంచి పాత్రలు లభించాయి. ముఖ్యంగా అవళ్ ఒరు తొడర్ కథై(అంతులేనికథ), అన్నక్కిళి(రామచిలుక), అవర్ గళ్(ఇది కథకాదు), గుప్పెడుమనసు, గోరింటాకు, సుజాత(ఈ సినిమాలో ద్విపాత్రాభినయం) వంటి చిత్రా

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లయిన 'శక్తి'

నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'శక్తి' విడుదలవడం...మొదటి షో నుంచే నిర్ద్వంద్వంగా ఫ్లాప్ టాక్ రావడం వెంటవెంటనే జరిగిపోయాయి. నిజంగా నందమూరి అభిమానులకు ఇది ఆశనిపాతమే. ఒక టాప్ హీరో సినిమాకోసం అతని అభిమానులు రోజుల తరబడి కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తుంటారు. అది ఫ్లాపయితే వాళ్ళు... తమ హీరో కంటే ఎక్కువ బాధపడతారు. మళ్ళా తర్వాత సినిమాకోసం ఎదురు చూపులు మొదలుపెడతారు. అందుకనే అగ్రహీరోలు సినిమాలను ఒప్పుకునేటప్పుడు తమ విచక్షణతోబాటు అభిమానుల ఆశలను, అంచనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తెలుగు సినిమా పరిశ్రమలో ముందున్న రికార్డులకంటే 50-60% అధికంగా కలెక్షన్లు వసూలు చేసి(సాధారణంగా ఇది 10-15% ఉంటుంది), కనీవినీ ఎరగని రికార్డులను స్థాపించిన 'మగధీర'ను తలదన్నే సినిమా చేయాలని ఎన్టీఆర్ కన్న కలలను దర్శకుడు మెహర్ రమేష్ కాలరాశాడు. నిర్మాత అశ్వనీదత్ ఇచ్చిన వనరులను, అవకాశాన్ని సద్వినియోగం చేయలేకపోయాడు(బడ్జెట్ ఎంతో చెబితే ఆ మొత్తాన్ని రమేష్ ఖాతాలో డిపాజిట్ చేస్తానని సినిమా ప్రారంభానికి ముందే దత్ చెప్పాడట). మగధీరను చూసి శక్తి స్టోరీ తయారు చేసుకున్నాడు(ఈయనగారు చేసిన మొదటి సినిమా-కంత్రీ మరో