Skip to main content

Posts

Showing posts from October, 2013

నెట్‌లో లభిస్తున్న మీ ఇంటి శాటిలైట్‌మ్యాప్, ఫోటోలు చూసుకోండి!

మీరు లేదా మీవాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉంటున్నట్లయితే , మీ ఇంటి శాటిలైట్ మ్యాపును , 360 డిగ్రీలలో ఫోటోలను చూసుకునే అవకాశాన్ని ఒక భారతీయసంస్థ కల్పిస్తోంది . వోనోబో . కామ్ (www.wonobo.com) అనే వెబ్ సైట్ ద్వారా మీరు మీ ఇంటి శాటిలైట్ మ్యాప్ , ఫోటోలు చూసుకోవచ్చు . ఆ వెబ్ సైటుకు వెళ్ళగానే , మీరు ఏ నగరం చూడాలనుకుంటున్నారని ప్రశ్న ఎదురవుతుంది . అక్కడున్న డ్రాప్ డౌన్ లోనుంచి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవాలి . మీరు ఆ నగరాన్ని ఎంచుకుని ఎంటర్ నొక్కగానే చార్మినార్ ఫోటో కనిపిస్తుంది . అయితే మీరు చూడాలనుకున్న ప్రదేశంకోసం మీరు కుడివైపు కిందభాగంలో కనిపిస్తున్న మ్యాప్ పైన క్లిక్ చేయాలి . అప్పుడు స్క్రీన్ సగభాగంలో మ్యాప్ , సగభాగంలో ఫోటో కనిపిస్తాయి . ఆ మ్యాప్ ద్వారా మౌస్ ను కదిలిస్తూ మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళొచ్చు . అక్కడ మీరు చూడాలనుకున్న ప్రదేశం మ్యాప్ తోబాటు , 360 డిగ్రీలలో ఫోటోలు కూడా దర్శనమిస్తాయి . మీరు టెక్నాలజీ పెద్దగా పరిచయంలేనివారైతే , ఈ వెబ్ సైట్ మీకు పల్లెటూరుతప్ప మరేమీ తెలియనివారిని నగరం నడిబొడ్డున వదిలినట్లుగా , కొద్దిగా అయోమయంగానే ఉంటుంది . ఎవరినైనా సాయం తీసుకుంటే నేవిగేషన

జూ.ఎన్‌టీఆర్‌ ఫెయిల్యూర్ ఫార్ములా

'రామయ్యా వస్తావయ్యా' ఓవర్సీస్ లో అతిపెద్ద ఫ్లాప్ గా రికార్డ్ సృష్టించిం దని తెలుగు సినిమా వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి . అదెంత నిజమోగా నీ తెలుగు ఇండస్ట్రీలో మంచి ట్యాలెంట్ , మాస్ అప్పీల్ ఉన్న జూ . ఎన్‌టీఆర్‌కు ఆది , సింహాద్రి స్థాయి ఘనవిజయం అందకుండా ఊరిస్తోందన్నది నిజం . యమదొంగ , బృందావనం , అదుర్స్ వంటివి విజయం సాధించినా అవి బ్లాక్ బస్టర్ హిట్స్ కాదన్నది అందరికీ తెలిసిన విషయమే . రామయ్యా వస్తావయ్యాకు ముందు వచ్చిన బాద్షా రు .40 కోట్లు వసూలుచేసిందని చెబుతున్నప్పటికీ , పెట్టుబడి పెట్టినవారెవరికీ లాభాలు రాలేదన్న సంగతి విదితమే . ఇక జూనియర్ ఫ్లాప్ లను ఒకసారి చూస్తే , ఇంత భారీ ఫ్లాపులు ప్రస్తుతమున్న హీరోలలో మరెవరికీ లేవనే చెప్పాలి . నరసింహుడు ఫ్లాపవడంతో ఆ సినిమా నిర్మాత చెంగల వెంకట్రావు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో దూకితే , పెద్ద ఎన్టీయార్ , చిరంజీవిలతో ఎన్నో సూపర్ హిట్లిచ్చిన సుప్రసిద్ధ నిర్మాత చలసాని అశ్వనీదత్ , శక్తి సినిమా ఫ్లాప్ అవటంతో ఉంటున్న ఇల్లుకూడా అమ్ముకున్నాడని ఫిలింనగర్ లో చెప్పుకుంటుంటారు . ఈ స్థితికి కారణమెవరని ప్రశ్నిస్తే , జూనియర్ స్వయంకృతాపరాధమని