Skip to main content

Posts

Showing posts from January, 2014

తెలుగువారి ఇంటింటా అలుముకున్న విచారం

తెలుగు సినీరంగమూలస్తంభాలలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు మరణించారన్నవార్తతో ఈ ఉదయంనుంచి రాష్ట్రంలోని ప్రతిఇంటా ఒకరకమైన విషాదం అలుముకుంది . ప్రతివారూ తమ ఇంట్లోని వ్యక్తి ఎవరో చనిపోయినట్లు విచారిస్తున్నారంటే దానికి కారణం ఆరు దశాబ్దాలుగా అక్కినేని ఆయా తరాలపైవేసిన ముద్రే అని చెప్పాలి . ముఖ్యంగా ప్రస్తుతం 40 సంవత్సరాలు , ఆ పైన వయస్సులో ఉన్న తెలుగువారందరూ అక్కినేని చిత్రాలు చూస్తూ పెరిగినవారే కావటంతో వారందరి జీవితం , సంస్కృతిలో ఆయన ఒక భాగమైపోయారు . ఈ కారణాలన్నిటిరీత్యా అక్కినేని మరణవార్త వారిని విచారానికి గురిచేసింది . అందుకే ఆయన భౌతిక కాయం చూడటానికి అన్నపూర్ణ స్టూడియోకు సినీపరిశ్రమవారు , వీఐపీలు , బంధువులకంటే సామాన్యజనమే ఎక్కువమంది తరలివస్తున్నారు . ఉదయంనుంచీ దాదాపుగా ఇళ్ళలో ఉన్నవారందరూ వివిధ టీవీ ఛానళ్ళలోఅక్కినేని మృతిపైవస్తున్న లైవ్ కార్యక్రమాలను కళ్ళప్పగించి చూస్తున్నారు . ముఖ్యంగా నాగార్జున మధ్యమధ్యలో కంటినీరు పెట్టుకుంటుడటం , సంబాళించుకుని వచ్చేవారిని పలకరించటం , అక్కినేని కుటుంబసభ్యులందరూ ఎటూ వెళ్ళకుండా భౌతికకాయంవద్దే నిలబడిఉండటం టీవీలు చూస్తున్నవారందరినీ కదిలిస్తున్నాయి . అక్కినే