Skip to main content

Posts

Showing posts from April, 2014

పవన్‌కై చంద్రబాబు వెంపర్లాటను ఆ రెండు వర్గాలూ జీర్ణించుకోగలవా!

మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మోడి సభలో తనతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబునాయుడు నిన్న స్వయంగా అతని కార్యాలయానికి వెళ్ళి మరీ కలుసుకోవటం తెలుగుదేశంపార్టీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. తెలుగుదేశం శ్రేణులలోని ఒక వర్గానికి, నందమూరి కుటుంబంలోని హరికృష్ణ వర్గానికి ఇది జీర్ణించుకోలేని పరిణామమని చెప్పొచ్చు. మొదటివర్గం కోణంచూస్తే, తెలుగుదేశంలో కోస్తాలోని శ్రేణులలో ఒక సామాజిక వర్గం చంద్రబాబు-పవన్ భేటీ వ్యవహారంపై లోలోపల రగిలిపోతోంది. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలోని టీడీపీ శ్రేణులు తల కొట్టేసినట్లయిందని భావిస్తున్నారు. దీనికి మూలాలు ఈనాటివికావు. తెలుగుదేశాన్ని తమ సొంతసంస్థగా పరిగణించే కమ్మ సామాజికవర్గానికీ, పవన్ కళ్యాణ్ సామాజికవర్గమైన కాపులకు కోస్తాలో చిరకాలంగా బద్ధవైరమున్న సంగతి తెలిసిందే. ఊళ్ళలో ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన సినీ అభిమానులుకూడా తమ తమ వర్గాలకు చెందిన నందమూరి, మెగా హీరోలకు 'బై డిఫాల్ట్' అభిమానులుగా మారిపోతుంటారు. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్‌వద్దకే స్వయంగ

ఉదయభాను ఓవరాక్షన్

టీవీ9 ఛానల్‌వారు ఉదయభాను ప్రయోక్తగా ప్రైమ్‌టైమ్‌(రాత్రి 9.30)లో నిగ్గదీసి అడుగు అనే కార్యక్రమాన్ని  ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్నికలవేళ ఎంపికచేసిన కొన్నిప్రాంతాలకు వెళ్ళి అక్కడ నెలకొనిఉన్న సమస్యలను ప్రజలద్వారా తెలుసుకుని, వాటిపై స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీయటం అనే కాన్సెప్ట్‌తో టీవీ9 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాస్తవానికి టీవీ9లోనే ఝాన్సీ చాలారోజులనుంచి ఇలాంటి కాన్సెప్ట్‌తోనే, స్థానిక సమస్యలపై చేతన అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. అయితే, 'గంగ గరుడాలెత్తుకెళ్ళేరా...ఇంక ఆంబోతులాట సాగేరా' అంటూ సాగే అనే ఒక పాటను స్వయంగా రచించి, పాడి తనలోని సామాజికస్పృహ కోణాన్ని చాటిచెప్పిన ఉదయభాను అయితే ఈ కార్యక్రమానికి యాంకర్‌గా సముచితంగా ఉంటుందని భావించారో, ఏమో టీవీ9వారు ఆమెను రంగంలోకి దించారు. కార్యక్రమం కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, ఉదయభాను తెచ్చిపెట్టుకుని ప్రదర్శిస్తున్న నాటకీయత, ఓవరాక్షన్‌ చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. సినిమాలలో రాజకీయనాయకులకు వ్యతిరేకంగా ఉపయోగించే అన్యాయం, నిర్లక్ష్యం, నిరాదరణ వంటి కొన్ని పడికట్టుపదాలు పట్టుకుని ఉదయభాను ఊదరగొడుతున

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

చిరంజీవి, మోహన్‌బాబులపై బాలయ్య సెటైర్లు

హైదరాబాద్‌లో గురువారంరాత్రి జరిగిన లెజెండ్ విజయోత్సవ సభలో హీరో బాలయ్య చిరంజీవి, మోహన్‌బాబులపై చెణుకులు విసిరారు. లెజెండ్ టైటిల్‌గురించి వివరించే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ  టైటిల్ మాస్‌కు అర్థమవుతుందో, లేదోనని మొదట సందేహించామని తెలిపారు. అయితే ఆమధ్య కొందరు లెజెండ్ ఎవరంటూ కొట్టుకుని ఆ పదాన్ని పాపులర్ చేశారంటూ లెజెండ్ పురస్కారంపై గతంలో మోహన్‌బాబు, చిరంజీవి మధ్య జరిగిన గొడవను పరోక్షంగా ప్రస్తావించారు. తాము ఈ టైటిల్ పెట్టటంద్వారా అసలు లెజెండ్ ఎవరో, ఏమిటో ప్రేక్షకులకు చూపించామన్నారు. సినీపరిశ్రమలోగానీ, రాజకీయాలలోగానీ తన తండ్రి ఎన్‌టీరామారావు ఒక్కరే లెజెండ్ అని బాలయ్య చెప్పారు. ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని, అందరిదీనన్నారు. ఎన్‌టీఆర్‌ను మరిచిపోయి లెజెండ్ ఎవరు...ఎవరు అని వెతికేవారు పిచ్చివాళ్ళని, అలా వెతికేవారికి పిచ్చెక్కిందేమోనని ప్రజలు అనుకుంటారని(#*@!?*#!) చెప్పారు. తెలుగు సినీపరిశ్రమ వజ్రోత్సవాలలో లెజెండ్ అంటూ కొందరికి పురస్కారాలు ఇస్తూ తనను పట్టించుకోకపోవటంపై తాను లెజెండ్ కాదా అంటూ మోహన్‌బాబు గొడవకు దిగటం, చిరంజీవి దానికి ఆవేశపూరితంగా సమాధానం ఇవ్వటం తెలిసిందే.    బాల

టీఆర్ఎస్ గొంతుకలై గర్జించే శ్రవణ్, కర్నె ప్రభాకర్‌లకు కేసీఆర్ మొండిచెయ్యి

తెలంగాణ రాష్ట్రసమితి వాదాన్ని వివిధ వేదికలపై, టీవీ చర్చా కార్యక్రమాలలో బలంగా వినిపించే వారిలో డాక్టర్ దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్ ముందుంటారు(ఇంతకుముందు రఘునందన్‌రావుకూడా ఈ జాబితాలో ఉండేవారు. అయితే ఆయన గత ఏడాది మే నెలలో పార్టీనుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు). పార్టీ అధికార ప్రతినిధులు మరెందరో ఉన్నా, ప్రత్యర్ధి పార్టీల నాయకుల విమర్శలను, వాదనలను తిప్పికొట్టడంలో వీరిద్దరిదే పైచేయిగా ఉంటుంది. అయితే పార్టీకోసం ఇంత గొంతుచించుకుని అరిచిన వీరిద్దరికీ పార్టీ అధినేత మొండిచెయ్యే చూపారు. శ్రవణ్ గతంలో ప్రజారాజ్యంలో చురుకైన పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా మెలుగుతూ ఆయన సిఫార్సుద్వారా సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ సాధించి ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యానికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఉస్మానియా యూనివర్సిటీనుంచి డాక్టరేట్ పొందిన శ్రవణ్, మంచి ఆలోచనాపరుడు, వక్త కావటంతో తక్కువ సమయంలోనే టీఆర్ఎస్‌లో పొలిట్‌బ్యూరోలో స్థానం సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో భువనగిరి, ముషీరాబాద్‌లలో ఏదో ఒకస్థానంలో పోటీచేయాలని ప్రయత్నించారుగానీ    టికెట్‌  దక్కలేదు. ఇక పార్టీ

"అయన వస్తున్నాడు" వర్సెస్ "ఆయన వస్తేనే బాగుంటుంది "

గతకొద్దిరోజులుగా న్యూస్ ఛానల్స్ చూస్తున్నవారికి పై రెండు స్లోగన్‌ల గురించి వివరించి చెప్పనవసరంలేదు. చూడనివారికోసం వివరణ - పై రెండు స్లోగన్‌లూ రెండు వేర్వేరు రాజకీయపార్టీల ఎన్నికల ప్రచార చిత్రాలలోనివి. మొదటిదేమో జగన్ పార్టీది, రెండేదేమో తెలుగుదేశానిది.  జగన్ పార్టీ ప్రచారచిత్రాలలో  ముందు ఏదో ఒక అక్రమాన్ని చూపిస్తారు. ఆ తర్వాత బాధితులవర్గంలోని ఒక వ్యక్తి లేచి ఇంకెన్నాళ్ళు మీ అక్రమాలు, ఆయనొస్తున్నాడు ఎలుగెత్తి అరుస్తారు. ఇంతలో పెద్ద ఎత్తున గాలి, దుమారం వస్తాయి. ఆ వెంటనే మీసాల రామ్ అన్నయ్య(ఈయన ఈ మధ్యనే సాక్షిలోకి రీఎంట్రీ ఇచ్చారు) తన బేస్ వాయిస్‌లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, దుమ్ము దులపండి అంటూ పిలుపునిస్తారు. థమ్సప్ యాడ్‌లోలా గాలి, దుమారాన్ని చూపటంపై జోకులు బాగా పేలుతున్నాయి...'వచ్చేదెవరూ! వైఎస్ దెయ్యమా?' అని. ఇక తెలుగుదేశం ప్రచారచిత్రాలలో ముందుగా, పెరిగిపోతున్న ధరలు, కరెంట్ కోత వంటి ఏదో ఒక సమస్యను ప్రస్తావిస్తారు. స్క్రీన్ అంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుందిగానీ, ఎక్కడో ఒక్కచోటమాత్రమే పసుపురంగు కనిపిస్తూఉంటుంది. సమస్యగురించి పాత్రలు మాట్లాడుకున్న తర్వాత ముక్తాయింపుగా &quo

స్టార్‌ప్లస్ మహాభారతం సీరియల్‌లో మూలకథకు దారుణ వక్రీకరణ

దూరదర్శన్‌లో 80వ దశకం చివరలో ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమైన రామాయణం, మహాభారతం హిందీ సీరియల్స్‌ను భాషతో సంబంధంలేకుండా దేశవ్యాప్తంగా అత్యధికశాతం ప్రజలు ఆదరించారు. రామానంద్ సాగర్(రామాయణం), బీఆర్ చోప్రా(మహాభారతం) ఆ సీరియళ్ళలో వివిధ పాత్రల స్వభావచిత్రణలో, నిర్మాణ ప్రమాణాలలో, సాంకేతిక విలువలలో ప్రశంశనీయమైన పనితీరు కనబరిచారు. పిల్లా, పెద్దా అందరినీ ఆ సీరియల్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సీరియళ్ళ ప్రసార సమయంలో రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గిపోయేదంటే వాటికున్న ప్రజాదరణను అంచనావేయొచ్చు. సాగర్, చోప్రా ఇరువురూ తమ సీరియల్స్ నిర్మాణంకోసం పాత తెలుగు పౌరాణిక చిత్రాలను అనుసరించటం మరో విశేషం. ఇక ప్రస్తుతానికి వస్తే, హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ స్టార్‌ప్లస్‌లో గత ఏడాది సెప్టెంబర్‌నుంచి రాత్రి 8.30గంటలకు మహాభారతం సీరియల్ ప్రసారమవుతున్న సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. స్వస్తిక్ ప్రొడక్షన్స్ అనే సంస్థ దాదాపు రు.120 కోట్ల ఖర్చుతో ఈ సీరియల్‌ను నిర్మిస్తోంది. మెలోడ్రామాకోసం ఈ సీరియల్ దర్శక, రచయితలు మూలకథను ఇష్టమొచ్చినట్లు మార్చేస్తూ పాత్రల స్వభావాలను తమకనుగుణంగా రూపుదిద్దుతున్నారు. వీరి వక్రీకరణ గ

వీరనారి విజయశాంతి, ఫైర్‌బ్రాండ్ రేణుకలకు భంగపాటు

మెదక్‌సీటు నాదే ఎన్నోరోజులనుంచీ ధీమాగా చెప్పుకుంటూ వచ్చిన రాములమ్మకు కాంగ్రెస్ ఝలక్ ఇచ్చింది. ఆమెను మెదక్ అసెంబ్లీసీటుకు పరిమితం చేసింది. మెదక్ పార్లమెంట్ సీటును నిన్నటిదాకా జగన్ పార్టీలో చురుకుగా పనిచేసిన డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి అనే అపరిచితుడికి ఇచ్చింది. మెదక్‌నుంచి తానుగానీ, కుమార్తె కవితగానీ, రమణాచారిగానీ నిలబడాలని యోచిస్తున్న కేసీఆర్, ఢిల్లీ లెవెల్‌లో పావులు కదిపి శ్రవణ్‌కుమార్‌రెడ్డికి ఈ టికెట్ కేటాయించేలా చేసినట్లు సమాచారం. అసలు విజయశాంతి టీఆర్ఎస్‌నుంచి బయటకు రావటానికి కారణమే మెదక్ పార్లమెంట్ సీటు. 2009లో తమ పార్టీలోకొచ్చిన విజయశాంతికోసం - కేసీఆర్ సురక్షితమైన మెదక్ సీటును త్యాగం చేసి మహబూబ్‌నగర్‌కు వెళ్ళారు. అక్కడ చాలా తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. ఈ సారిమాత్రం విజయశాంతికి మెదక్‌ను ఇవ్వగూడదని ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఇది మెల్లమెల్లగా రాములమ్మకుకూడా అర్ధమైంది. దాంతో వారిద్దరిమధ్యా సంబంధాలు చెడి పార్టీనుంచి ఆమె నిష్క్రమణకు కారణమయింది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాతకూడా తనకు మెదక్ సీటు కేటాయిస్తానని సోనియా హామీ ఇచ్చినట్లు రాములమ్మ అందరికీ చెప్పుకున్నారు. చివరికి చూస్

చెవుల్లో అమృతం పోస్తున్నట్లనిపించే లక్కీ అలీ పాట

అద్భుతమైన మెలోడీతో సాగిపోయే ఈపాట, లక్కీ అలీ రూపొందించిన 'గోరీ తేరీ ఆంఖే...' అనే ప్రైవేట్ ఆల్బమ్‌లోనిది.  2001లో ఈ ఆల్బమ్‌ విడుదలయింది. దీనిలో ఎనిమిది పాటలున్నప్పటికీ పై పాటే హైలైట్. వియోగంమీద ఉన్న పాటలలో దీనికి మొదటి వరుసలో స్థానం కల్పించొచ్చు. లక్కీ అలీ గాత్రం చెవులలో అమృతం పోస్తున్నట్లుంటుంది. మంచి సంగీతంతోబాటు దృశ్యపరంగా కూడా బాగానే విజువలైజ్ చేశారని చెప్పొచ్చు.  అలనాటి బాలీవుడ్ హాస్యనటుడు మహమూద్ కుమారుడైన లక్కీ అలీ ఆ వారసత్వంతో సంబంధం లేకుండా స్వతహాగా మంచి ప్రతిభ ఉన్న కళాకారుడు. అయినా ఎందుకో రావల్సినంత గుర్తింపు రాలేదనిపిస్తుంది. నటనలోకూడా ప్రవేశముంది. త్రికాల్, కాంటే, సుర్, కసక్‌వంటి కొన్ని బాలీవుడ్ చిత్రాలలో నటించారు. మూడు వేర్వేరు దేశాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలను పెళ్ళి చేసుకున్న లక్కీకి ఐదుగురు పిల్లలు. మరో విశేషమేమిటంటే అలనాటి ప్రసిద్ధ కథానాయిక మీనాకుమారి, లక్కీ అలీ తల్లి మహేలక సొంత అక్కా చెల్లెళ్ళు. ఈ పాట సాహిత్యం కావాలంటే ఈ లింక్‌కు వెళ్ళండి - http://lucky-ali-songs.blogspot.in/

చంద్రబాబుకు ఒకకంట పన్నీరు, ఒకకంట కన్నీరు

రెండుకళ్ళ సిద్ధాంతకర్త , తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పరిస్థితి ఒక కంట పన్నీరు , ఒక కంట కన్నీరు అన్నట్లుంది . సీమాంధ్రలోనేమో కాంగ్రెస్‌నుంచి వస్తున్ననేతలతో పార్టీ కార్యాలయానికి హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండగా , అటు తెలంగాణలో పార్టీ దాదాపుగా ఖాళీ అయిన పరిస్థితి . సీమాంధ్రలో తెలుగుదేశం కార్యాలయాలు కిటకిటలాడిపోతున్నాయి . దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ , ఎన్నో పదవులు నిర్వహించిన జేసీ దివాకరరెడ్డి , డీఎల్ రవీంద్రారెడ్డి , రాయపాటి సాంబశివరావు , మండలి బుద్ధప్రసాద్‌వంటి సీనియర్ నాయకుల దగ్గరనుంచి నిన్నటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు , ఏరాసు ప్రతాపరెడ్డి , టీజీ వెంకటేష్ , గల్లా అరుణ , పితాని సత్యనారాయణ ప్రభృతులవరకు పలువురు కాంగ్రెస్ అగ్రనాయకులు పసుపు తీర్ధం పుచ్చుకుంటున్నారు . ఇక ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఛోటా , మోటా నాయకులకైతే కొదవేలేదు . సీమాంధ్రలో కాంగ్రెస్‌ను ఖాళీచేయించి చావుదెబ్బ కొట్టాలనే లక్ష్యంతో ఆ పార్టీనుంచి వస్తున్నవాళ్ళను  వస్తున్నట్లు అక్కున చేర్చుకుని పార్టీ కండువా కప్పుతున్నారు చంద్రబాబు. ఇక

కేసీఆర్ హామీల వర్షంలో తడిసి ముద్దవుతున్న తెలంగాణ

అసలే ఎన్నికల వేళ. ఏ రాజకీయపార్టీ అయినా కొత్త కొత్త హామీలను, సంక్షేమ పథకాలను ప్రకటించి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించటం మామూలే. మరి రాజకీయంలో ఎత్తులు, జిత్తులు అన్నిటినీ పుక్కిట పట్టిన కేసీఆర్‌వంటి నాయకుడి సంగతి చెప్పేదేముంది. ఈసారి ఎన్నికల కదనరంగంలో వాగ్దానాల ప్రకటనలో అన్నిపార్టీల నాయకులలోకీ కేసీఆరే ముందంజలో ఉన్నారని చెప్పాలి.  బంగారు తెలంగాణను తయారుచేసి తెలంగాణ ప్రజలకు అందించటమే టీఆర్ఎస్ లక్ష్యమని చెబుతూ ప్రతి ఎన్నికలసభలోనూఆకర్షణీయమైన హామీలను గుప్పిస్తున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కగదితో ఇల్లు కట్టించి ఇచ్చి దానినే కైలాసం, వైకుంఠంగా భావించమంటోందని, తమ ప్రభుత్వంవస్తే పేదలకు వంటగది, స్నానాలగదితోసహా రు.3 లక్షలతో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇస్తున్నారు. దళితులకు 3 ఎకరాల భూమిని ఉచితంగా అందిస్తామని వాగ్దానం చేశారు. రు.1 లక్ష లోపు ఇళ్ళ, పంట రుణాలున్నవారెవరూ వాటిని కట్టొద్దని, వాటన్నంటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణరాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులనందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు(ఈ హామీపై తెలంగాణ నిరుద్యోగులు కేసీఆర్‌మీద కారాలు, మిరియాల

మయసభలోలాంటి మెట్ల మాయాజాలం వీడియో చూడండి!

గమనిక: మొదటి 40 సెకన్లవరకు విశేషమేమీ కనిపించదు...ఓపిక పట్టి చూడండి.

గుడివాడలో దొంగనోట్లు పంచింది తెలుగుదేశమంటూ సాక్షి కథనం

గత ఆదివారం గుడివాడలో మున్సిపల్ ఎన్నికలసందర్భంగా ఒకవార్డులో జగన్ పార్టీ నేతలు ఓటర్లకు దొంగనోట్లు పంచారని మీడియా అంతా కోడైకూసిన సంగతి తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియావంటి ఆంగ్ల దినపత్రికలుకూడా వైఎస్ఆర్ సీపీనేతలు ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్నట్లు (http://goo.gl/UqFBNR) వార్తను ఇచ్చాయి . అయితే, సాక్షి మీడియామాత్రం ఈ వార్తను దీనిని 'తనదైన శైలి'లో ఆవిష్కరించింది. గుడివాడలో తెలుగుదేశంనేతలు చెల్లనినోట్లు పంపిణీ చేశారంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో కథనాలు ఇచ్చింది. క్రింది లింక్‌లో ఆ కథనాలను చూడొచ్చు. http://goo.gl/ogIJM3 ఈ వార్త పూర్వాపరాలలోకి వెళ్తే, గుడివాడ పట్టణంలోని 21వవార్డులో అభ్యర్ధి ఒకరు ఓటుకు రెండువేలరూపాయల చొప్పున డబ్బు పంచారు. నాలుగు ఐదొందలరూపాయల నోట్లుగా ఆ డబ్బును ఇచ్చారు. తీసుకున్న ఓటర్లలో కొందరు వాటిని దుకాణాలలో ఇవ్వబోగా అవి 2005కు పూర్వం ముద్రించినవి కాబట్టి చెల్లబోవంటూ వ్యాపారులు నిరాకరించారు. దీంతో, తాము మోసపోయామని భావించిన సదరు ఓటర్లు లబోదిబోమన్నారు. అయితే తాము తీసుకుంది అక్రమ వ్యవహారంకాబట్టి పోలీసులకు చెప్పలేక తేలుకుట్టిన దొంగల్లాగా కిమ్మనకుండా కూర్చున్నారు.