Skip to main content

Posts

Showing posts from March, 2014

"సీమాంధ్రలో జగన్, తెలంగాణలో తెరాస విజయఢంకా"

త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్ పార్టీ, తెలంగాణలో తెరాస మెజారిటీ సాధిస్తాయని తాము నిర్వహించిన సర్వేలో తేలినట్లు    నీల్సన్-ఎన్‌టీవీ సంస్థలు  వెల్లడించాయి . ఇవాళ వెలువడిన ఈ సర్వేఫలితాల ప్రకారం, సీమాంధ్రలో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి 129-133, తెలుగుదేశానికి 42-46, కాంగ్రెస్‌కు 0 స్థానాలు, పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ పార్టీకి 19-21స్థానాలు, తెలుగుదేశానికి 4-6, కాంగ్రెస్‌కు 0 స్థానాలు లభిస్తాయి. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు 51-57, కాంగ్రెస్‌కు 46-52, బీజేపీకి 5-8, తెలుగుదేశానికి 4-6,ఎమ్ఐఎమ్‌కు 7-8, పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసకు 6-8, కాంగ్రెస్‌కు 7-9 సీట్లు దక్కనున్నాయని సర్వే చెబుతోంది. అయితే, అభ్యర్ధుల ఎంపిక, పొత్తుల ఖరారు తర్వాత ఈసర్వే ఫలితాలలో స్వల్ప తేడాలుంటాయని, మళ్ళీ తాము కొద్దిరోజులలో మరో సర్వే జరపబోతున్నామని, అప్పుడు మరింత ఖచ్చితత్వం వస్తుందని నీల్సన్ సంస్థ ప్రతినిధి శేషగిరిరావు చెప్పారు. సీమాంధ్రలో జగన్ పార్టీ ప్రభావం నిలకడగా ఉంటుండగా, తెలుగుదేశం పుంజుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండుపార్టీలమధ్య ఓట్లశాతం తేడా ఎనిమిదేనని, పట్

పవన్ విశాఖ ప్రసంగంలో ఒక చెప్పుకోదగ్గ పాయింట్

జనసేన పార్టీ , దాని సిద్ధాంతాలు , పవన్ ' ఇజం ' పైన ఎన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా , విశాఖపట్నం ప్రసంగంలో కళ్యాణ్ లేవనెత్తిన ఒక పాయింట్‌‌ మాత్రం అధికశాతంమందినుంచి ప్రశంసలు అందుకుంటోంది. . అదేమిటంటే , రానున్న లోక్‌సభ ఎన్నికలకుగానూ అభ్యర్ధులను ఎంపికచేయటానికి కాంగ్రెస్ పెద్దలు వార్ రూమ్‌లో ఏకబిగిన 12 గంటలపాటు చర్చలు జరిపినట్లు నిన్న దినపత్రికలలో వచ్చిన వార్తగురించి . సొంతపార్టీ అభ్యర్ధుల ఎంపికపై ఇంత సుదీర్ఘ కసరత్తు చేసే కాంగ్రెస్ పార్టీ - దేశంలోని అతిపెద్దరాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌ను విభజించటంపై అదే వార్ రూమ్‌లో 40 నిమిషాలలో నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు . రాష్ట్రప్రజల మనోభావాలంటే కాంగ్రెస్ పార్టీకి అంత చులకనగా ఉందా అంటూ నిప్పులు చెరిగారు . ఈ పాయింట్‌ను మాత్రం అందరూ ఒప్పుకుని తీరాలి . పదేళ్ళుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ , ఎన్నికలు రాబోతున్నాయనగా , ఆఖరినిమిషంలో విభజనకు అంగీకరించటం తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించికాదని , ఓట్లకోసమేనని అందరికీ తెలిసిన విషయమే . ఆ మాటకొస్తే , కాంగ్రెస్ పార్టీ హడావుడిగా ప్రవేశపెట్టిన ఈ విభజనబిల్లువలన తెలంగాణ రాష

మరో వివాదంలో మోహన్‌బాబు:గౌరవ డాక్టరేట్ నకిలీదేనని నిర్ధారణ

డైలాగ్‌కింగ్ మోహన్‌బాబును మరో వివాదం చుట్టుముట్టింది . అయినా వివాదాలు ఆయనకు కొత్తకాదనుకోండి . ఈ సారి వివాదం ఆయనకు కొన్నేళ్ళక్రితం లభించిన గౌరవ డాక్టరేట్ పట్టాపై . అమెరికాలోని ఇంటర్నేషనల్ క్యాలిఫోర్నియా యూనివర్సిటీ మోహన్‌బాబుకు డాక్టరేట్ పట్టాఇచ్చి గౌరవించింది . అప్పటివరకు ఎన్టీఆర్ , ఏఎన్‌ఆర్ వంటి గొప్పనటులకు ఆంధ్రా యూనివర్సిటీయో , నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్‌లు ఇవ్వటంమాత్రమే చూసిన తెలుగువారికి మోహన్‌బాబు నేరుగా అమెరికానుంచే డాక్టరేట్ పట్టా పొందటం ఆశ్చర్యకరంగానూ , అపూర్వంగానూ అనిపించింది . ఈ అరుదైన ఘనత సాధించినందుకు ఆయనకు చెన్నైలో నాడు భారీఎత్తున సన్మానంకూడా జరిగింది . సదరు అమెరికా యూనివర్సిటీ ఒక పెద్ద ఫ్రాడ్ అని ఇప్పుడు తేలింది . ఈ సంస్థ మోహన్‌బాబుకేకాక మాజీ ఎంపీ రాజగోపాల్ నాయుడు ( మాజీ మంత్రి గల్లా అరుణతండ్రి ), మిసిమి పత్రిక ఎడిటర్ ఆలపాటి రవీంద్రనాథ్ వంటి మరికొందరు తెలుగువారికికూడా ఈ గౌరవ డాక్టరేట్‌లు ఇచ్చిందట . ఈ యూనివర్సిటీ వ్యవహారం తేడాగా ఉన్నట్లు గమనించిన నరిశెట్టి ఇన్నయ్యగారనే సీనియర్ తెలుగు జర్నలిస్ట్ అమెరికా వెళ్ళినపుడు దీనిపై పరిశోధన చేయగా ఆశ్చర

సీమాంధ్రప్రాంతంలో 'హాట్ ఫేవరెట్' తెలుగుదేశమా!

సీమాంధ్రలో తెలుగుదేశంలోకి జంపింగ్‌లు, మీడియాలో వస్తున్న వార్తలనుబట్టిచూస్తే అక్కడ జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీయే 'హాట్ ఫేవరెట్'అన్న అభిప్రాయం కలగకమానదు. మరోవైపు తమ పార్టీలోకి వస్తున్న జంప్ జిలానీలను చూసి ఆత్మవిశ్వాసం పొంగి పొర్లుతున్న చంద్రబాబునాయుడు ఇప్పటికే సీమాంధ్ర సీఎమ్ అయిపోయినట్లు మాట్లాడుతున్నారు(ఇటీవల హైదరాబాద్‌లో 'మీట్ ది పీపుల్' అనే కార్యక్రమంలో  పాల్గొంటూ, ఆ కార్యక్రమానికి హాజరైన వివిధవర్గాలవారికి భారీ లెవల్‌లో హామీలు గుప్పించి సీమాంధ్ర ముఖ్యమంత్రిననే భావం అక్కడున్నవారికి కల్పించారట చంద్రబాబు). భారీస్థాయిలో   కాంగ్రెస్ నుంచి దూకుతున్న జంప్ జిలాని నాయకులతో తెలుగుదేశంపార్టీ కిటకిటలాడుతున్నమాట వాస్తవమే. ఓవర్‌ఫ్లోను తట్టుకోలేక కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడిన మాటా నిజమే. అయితే దీనిని ఫలితాలకు సూచికగా తీసుకోవటం అమాయకత్వమే అవుతుంది. టీడీపీలోకి దూకుతోంది నాయకులేగానీ, ఓటర్లుకాదన్న విషయాన్ని మరిచిపోగూడదు. అసలు ఈ జంపింగ్ జపాంగ్‌లవలన విశాఖపట్నం, అనంతపురం, కర్నూలువంటి పలు జిల్లాలలో  ఆ ప

వర్మ మాటల్ని నిజం చేసిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలంటూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్‌లో ఆమధ్య ట్వీట్ల వర్షం కురిపించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. వర్మ మాటల్ని పవన్ మొత్తానికి నిజం చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇవాళో, రేపో పూర్తి వివరాలు తెలియనున్నాయి.  "పవన్ కళ్యాణ్‌లో నిజాయితీ ఉంది, చూట్టానికి బాగుంటాడు, సినిమాల్లో అయితే ధియేటర్లలోనే చూడాలి, రాజకీయాల్లోకి వస్తే న్యూస్ ఛానల్స్‌లో రోజూ చూడొచ్చు" అంటూ తన ట్వీట్లకు కారణాన్ని వర్మ నాడు వివరించాడు. అది వర్మశైలి వ్యంగ్యమో, మనసులోనుంచి వచ్చిన మాటో చెప్పలేముగానీ పవన్ కళ్యాణ్‌లో నిజాయితీ, కొన్ని సిద్ధాంతాలు, ఆదర్శాలు, సమాజానికి ఏదో చేయాలని(concern) ఉందని మాత్రం దాదాపుగా అందరూ అంగీకరిస్తారు. అధికారమో, డబ్బో మాత్రమే లక్ష్యమే అయితే తన వృత్తిలో అత్యద్భుతమైన దశకు చేరుకున్న ప్రస్తుతతరుణంలో దానిని పణంగా పెట్టి రాజకీయాలలో దిగడని టాలీవుడ్ వర్గాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. కానీ రాజకీయాలకు కేవలం నిజాయితీ, ఆదర్శాలు, పుస్తక పరిజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ సొంత అన్నగారైన