Skip to main content

Posts

Showing posts from March, 2015

ఆంధ్రా కేజ్రీవాల్ అవ్వాలనుకుంటున్న శివాజికి విశాఖలో చేదు అనుభవం

ఏదో ఒక సమస్య తీసుకుని ప్రజా ఉద్యమాలు నడిపి అర్జెంట్‌గా ఏపీలో అగ్రనేతగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న నటుడు శివాజికి దురదృష్టవశాత్తూ నిన్న విశాఖపట్నంలో చుక్కెదురయింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం శివాజీ ఇటీవల ఉద్యమం ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రం నలువైపులా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో మొదటి సమావేశం నిర్వహించారుకూడా. గురువారం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలోని ప్లాటినంజుబ్లీ హాల్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశంలో మాట్లాడుతూ కొందరు వక్తలు బీజేపీ, టీడీపీ పార్టీలను విమర్శించినపుడు శివాజీ వారిని అడ్డుకుని మైక్ కట్ చేశారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ వక్తలను శివాజి అనుచరులు అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో  అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అసంతృప్తికి గురైన శివాజి, ఇలా అయితే వెళ్ళిపోతానంటూ తన అనుచరులతోసహా అక్కడనుంచి కారులో ఉడాయించారు. ఓర్పు, సహనంలేని శివాజికి రాజకీయాలు ఎందుకంటూ సమావేశానికి హాజరైన విద్యార్థులు, ఉద్యమకారులు హీరోగారిని తీవ్రంగా దుర్భాషలాడారు. ఈ సమావేశంతాలూకు వీడియోను ఇక్కడ చూడొచ్చు. 'మాస

పేపర్లకెక్కిన అక్కినేని ఫ్యామిలీ: జప్తు నోటీసులు జారీచేసిన బ్యాంక్‌లు

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో అన్నపూర్ణ స్టూడియోస్‌కు చెందిన అత్యంత విలువైన 7 ఎకరాలు 25 గుంటల స్థలాన్ని ఇండియన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ అధికారులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. స్టూడియోస్‌తరపున తమవద్ద తీసుకున్న రుణాలకు సంబంధించి రు. 62కోట్లు బకాయి ఉందని, దీనిపై గత ఏడాది జనవరి రెండున డిమాండ్ నోటీస్ జారీ చేసినప్పటికీ రుణగ్రహీతలు స్పందించనందున 20మార్చి 2015న స్టూడియోస్‌ తరపున తనఖా పెట్టిన స్థలాన్ని స్వాధీన పరుచుకున్నట్లు బ్యాంక్ అధికారులు ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ స్థలానికి సంబంధించి ఎట్టి లావాదేవీలూ జరుపరాదని హెచ్చరించారు. రుణాన్ని తీసుకున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కు అక్కినేని నాగేశ్వరరావు, ఆయన కుమారులు నాగార్జునరావు(నాగార్జున) ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అయితే నాగేశ్వరరావు చనిపోయినందున  నాగార్జునతోబాటు నాగేశ్వరరావు వారసులు వెంకట నారాయణరావు(వెంకట్), కుమార్తె నాగసుశీల('కరెంట్' సుశాంత్ తల్లి), మరో కుమార్తె సరోజ మనవరాలు సుప్రియ(అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం హీరోయిన్), ఇంకా నిమ్మగడ్డ ప్రసాద్(వాన్‌పిక్, మ్యాట్రిక్స్, మాటీవీ), వెంకటేశ్ రొడ్డం

యాపిల్‌వారి మరో ప్రతిష్ఠాత్మక ఉత్పాదన 'యాపిల్ వాచ్' ఆవిష్కారం!

మ్యాక్, ఐపాడ్, ఐఫోన్, మ్యాక్ బుక్, ఐపేడ్‌వంటి అత్యుత్తమమైన ఉత్పత్తులతో చరిత్ర సృష్టించిన యాపిల్ సంస్థ, తమ మరో ప్రతిష్ఠాత్మక ఉత్పత్తి 'యాపిల్ వాచ్‌'ను నిన్న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో విడుదల చేసింది.  దీనిని రెండు సైజులలో వివిధ మోడల్స్, డిజైన్లలో తయారు చేశారు. ప్రారంభ దర - 349 అమెరికన్ డాలర్లు. ఇది సుమారు రు.21 వేలకు సమానం. గరిష్ఠధర - 17,000 అమెరికన్ డాలర్లు(రు. 10,20,000). గరిష్ఠ మోడల్‌ వాచ్‌ను 18 క్యారట్ల బంగారంతో రూపొందించారు. డిస్‌ప్లే గ్లాస్‌ను సఫైర్(నీలం)తో తయారు చేశారు. వచ్చేనెల పదినుంచి ఆర్డర్‌లు బుక్ చేసుకోవచ్చని, 24నుంచి స్టోర్లలో అందుబాటులో ఉంటుందని సంస్థ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. ఐఫోన్ చేసే కాల్స్, మెసేజెస్, పేమెంట్స్‌వంటి పలు పనులతోబాటుగా ధరించినవారి హృదయ స్పందనలను(హార్ట్ బీట్), వారు చేసే వ్యాయామం వివరాలను కూడా నమోదు చేస్తుందని కుక్ చెప్పారు. చేయవలసినపనులను(రిమైండర్స్) మణికట్టుమీద తట్టిమరీ గుర్తు చేస్తుందని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లలో చెక్‌ఇన్ చేయటానికి, కొన్ని హోటల్స్‌లో గదులకు తాళంగాకూడా ఈ వాచ్‌ను ఉపయోగించొచ్చని టిమ్ కుక్ నిన్న ఆవిష్కరణ కార్యక్రమంలో చె