Skip to main content

Posts

Showing posts from February, 2015

ఢిల్లీలో అద్భుతాన్ని ఆవిష్కరించిన సామాన్య మానవుడు!

ఎనిమిది నెలలక్రితం తిరుగులేని మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న 'మోడి-షా అండ్ కో'కు ఢిల్లీ ఆమ్ ఆద్మీలు(సామాన్య మానవులు) దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. ప్రభుత్వంలో, పార్టీలో ఏకపక్షంగా - కేంద్రీకృతంగా వ్యవహారాలు నడుపుతున్న మోడి-షా ద్వయానికి ఇది చెంపపెట్టు. అమిత్ షా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ఎన్నికలలో తన శక్తియుక్తులన్నింటినీ ప్రయోగించినా ఉపయోగం లేకుండా పోయింది. తమపార్టీ ఎంపీలు 300మందినికూడా అమిత్ షా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దించారు. ఢిల్లీ నగరంలో గణనీయసంఖ్యలో ఉన్న ఆంధ్రప్రాంత తెలుగువారిని ఆకట్టుకోవటంకోసం ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించారు. ఆఖరు నిమిషంలో కిరణ్‌బేడిని పార్టీలోకి తీసుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు(దీంతో అంతర్గత విభేదాలు మొదలై ఇదే చివరికి 'బూమరాంగ్' అయింది). స్వయంగా నరేంద్ర మోడి విస్తృతంగా ప్రచారసభలలో పాల్గొని ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో చేసిన తప్పులను తెలుసుకుని దాదాపు సంవత్సరకాలంగా పక్కా ప్రణాళికతో పనిచేస్తూ లక్ష్యాన్ని సాధించింది. పా

'superlative' ముఖ్యమంత్రి కేసీఆర్

చిన్నప్పుడు ఇంగ్లీష్ గ్రామర్‌ చదువుకున్నవారందరికీ parts of speech లోని ఎనిమిది భాగాలలో Adjective అనేది గుర్తుండే ఉంటుంది. ఆ Adjectiveలో Superlative Adjective అనే మరో సబ్ క్యాటగిరీ ఉంటుంది. ఆ సూపర్‌లేటివ్ ఎడ్జెక్టివ్‌కు అర్థం 'సర్వోత్కృష్టమమైనది' అని. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకయ్యా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సమయాలలో, సందర్భాలలో ఆయా సమస్యలకు ప్రకటిస్తున్న 'సర్వోత్కృష్ట' పరిష్కారాలగురించి చెప్పేందుకు. అదేమిటో ఏ సమస్యకుకూడా సర్వోత్తమమైనది తప్పితే దానికి తక్కువస్థాయిలో పరిష్కారం కేసీఆర్‌కు కనబడదు.  ఏదైనా సమస్యను వివరించటం ఆలస్యం ఆయన దానికి సర్వోత్కృష్టమైన పరిష్కారం ప్రకటించిపారేస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం సందర్భంగా మొదలుపెట్టిన ఈ పోకడ, అధికారం చేపట్టిన ఆర్నెల్ల తర్వాతకూడా కొనసాగుతూనేఉంది. నాడు ప్రచారంలో పేదలకు డబల్ బెడ్‌రూమ్ ఫ్లాట్, మూడెకరాల పొలం, కోటి ఎకరాలకు సాగునీరు, లక్షా 25వేల ఉద్యోగాలు, ముస్లిమ్‌లకు 12శాతం రిజర్వేషన్లు వంటి వాగ్దానాలు చేశారు. వాటి ఆచరణ ఏదశలో ఉందో ఎవరికీ తెలియదు. వాగ్దానాలుమాత్రం  అధికారం చేపట్టిన తర్వాత మరింత జోర