Skip to main content

Posts

Showing posts from November, 2016

రెడ్‌మి, లెనోవా ఫోన్‌లు అంతచౌకగా ఎలా అమ్ముతున్నారో తెలుసా!

రెడ్‌మి(షియామి), లెనోవా, జియానీ, లీకో, హ్వావేయ్(హువావే అని కూడా పిలుస్తారు), కూల్‌ప్యాడ్ వంటి చైనా కంపెనీల మొబైల్ ఫోన్‌ల మోడల్స్ భారత్‌లో అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోతున్న సంగతి తెలిసిందే. మంచి కాన్ఫిగరేషన్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఉన్న పవర్‌ఫుల్ ఫోన్లను శాంసంగ్, సోనీ, ఎల్‌జీ, హెచ్‌టీసీ వంటి బడా కంపెనీల ఫోన్ల ధరలలో మూడోవంతుకే అందిస్తుండటంతోనే పైన పేర్కొన్న చైనా కంపెనీల ఫోన్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా రెడ్‌మి సంస్థ ఫోన్‌లు భారతీయుల హృదయాలను కొల్లగొట్టి వారి జేబుల్లో తిష్ఠవేసుకుని కూర్చున్నాయి. రెడ్‌మి నోట్ 3, రెడ్‌మి 3ఎస్, రెడ్‌మి 3 ప్రైమ్ మోడల్స్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మొబైల్ ఫోన్లుగా ఇటీవల రికార్డులకెక్కాయి. ఈ మోడల్స్‌లోని స్పెసిఫికేషన్స్‌తోనే శాంసంగ్, సోనీ, ఎల్‌జీ కంపెనీల ఫోన్లను కొనాలంటే మూడింతలు ఎక్కువ డబ్బు పెట్టాల్సిఉంటుంది(రెడ్‌మి రెండేళ్ళ క్రితం తయారుచేసిన మోడల్స్‌లో స్నాప్ డ్రాగన్ 400, స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్‌ను వాడగా, అదే ప్రాసెసర్‌లతో తయారుచేసిన మోడల్స్‌ను శాంసంగ్ ప్రస్తుతం 15-20 వేల రేంజిలో అమ్ముతోంది). మరి ఈ చైనా కంపెనీలు ఇంత కారుచౌకగా ఎల