Skip to main content

Posts

Showing posts from December, 2016

'వంగవీటి' కాదు 'దేవినేని' అంటున్నారు!

ఎల్లప్పుడూ ప్రజల నోళ్ళలో నానుతూ సంచలనంగా ఉండాలని కోరుకునే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం వంగవీటి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. కోస్తా ఆంధ్ర రాజకీయాలలో, అదీ బెజవాడలో ఎవరూ మరిచిపోలేని నాయకుడు వంగవీటి మోహనరంగా కథ ఆధారంగా తీస్తున్న చిత్రం కావటంతో ఇది మొదటినుంచీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కోస్తాలోని రెండు ప్రధాన కులాలకు సంబంధించిన సబ్జెక్ట్ అయినందున అంత సున్నితమైన అంశాన్ని వర్మ ఎలా డీల్ చేస్తాడా అని అందరిలో ఆసక్తి నెలకొంది. చిత్రం స్క్రిప్టు తయారీలో భాగంగా వర్మ రెండుసార్లు విజయవాడవెళ్ళి ఇరు వర్గాలనూ కలుసుకున్నారు. ఆయనకు దేవినేని సహకరించినప్పటికీ వంగవీటి కుటుంబం మాత్రం సానుకూలంగా స్పందించలేదు. దానికి కారణం వర్మ నిర్మాణంలో గతంలో రూపొందిన 'బెజవాడ' చిత్రంలో దేవినేని వర్గాన్నే హీరోగా చూపించటమేనని టాక్ వినబడింది. పూర్తి కథనం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గౌతమీపుత్ర: క్రిష్ కాపీ నైపుణ్యానికి పరాకాష్ఠ!

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ఇవాళ్టికి యూట్యూబ్ లో 40 లక్షల వ్యూస్ సంపాదించి టాలీవుడ్ లో రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సరికొత్త రికార్డు ఆవిష్కరణ సందర్భంగా నందమూరి అభిమానులు సంబరాలు కూడా జరుపుకుంటున్నారు.  అయితే రెండు నిమిషాల 20 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఇప్పుడు సినిమాపండితుల మధ్య చర్చనీయాంశమయింది. ఈ కథనం పూర్తిగా చదవటానికి, ఇక్కడ క్లిక్ చేయండి.