Skip to main content

Posts

Showing posts from February, 2017

కోదండరామ్ పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా!

ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని - సగటు తెలుగు కమర్షియల్ సినిమాలలో హీరోలాగా - ఒంటిచేత్తో కేసీఆర్, ఆయన నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ సాధించుకొచ్చినట్లు ఎవరైనా అంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఈ రెండున్నరేళ్ళుగా కేసీఆర్ టైమ్ బాగుండటంతో ఆయనను ఇంద్రుడు, చంద్రుడు, అసహాయశూరుడు, మేరునగధీరుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నవారు(ఈ గొర్రెలమందలో ఈమధ్య కొందరు ఆంధ్రోళ్ళుకూడా చేరటం ఒక విశేషం) ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఘనతలో కేసీఆర్ కృషి మూడోవంతు మాత్రమే. To Read Full Story, Click Here.

సీఈఓ బాబుగారు ఈవెంట్ మేనేజర్ స్థాయికి పడిపోయారెందుకు!

ప్రస్తుతం ఉన్నస్థితినుంచి మెరుగైన స్థితికి వెళ్ళాలనుకోవటం మానవ నైజం . మరి మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారేమిటి దీనికి రివర్సులో వెళుతున్నారు . నాడు 1995 నుంచి 2004 వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా దాదాపు పదేళ్ళు పాలించిన బాబుగారు ఏపీకి తాను సీఈఓనని అప్పట్లో చెప్పుకున్న సంగతి తెలిసిందే ( కార్పొరేట్ సంస్కృతిపట్ల ఆ మోహంలో రెచ్చిపోయి వ్యవసాయం దండగ అనటమే ఆయన కుర్చీకిందకు నీళ్ళు తేవటం వేరే విషయమనుకోండి ). మరి పదేళ్ళతర్వాత గద్దెనెక్కిన ఆయనకు ఇప్పుడేమయిందోగానీ ఈవెంట్ మేనేజర్ స్థాయికి దిగిపోయారు . To Read Full Article, Click Here.

కోడెల సంచలన వ్యాఖ్యలపై నేషనల్ మీడియాలోనూ చర్చ!

వంటింటికి పరిమితమైతేనే ఆడవాళ్ళకు మంచిదనే అర్థంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్థానికంగా రెండు తెలుగురాష్ట్రాలలో పెద్ద ప్రభావం కనిపించకపోయినా జాతీయస్థాయిలో మాత్రం అవి పెద్ద దుమారాన్నే లేపాయి. మహిళాసంఘాల నేతలు, వివిధ రాజకీయపార్టీల నాయకులు కోడెలపై నిప్పులు చెరుగుతున్నారు. To Read Full story Click Here.