Skip to main content

Posts

Showing posts from January, 2018

మనం తిండి తినే విధానమంతా తప్పేనట! డాక్టర్‌లు కూడా ఫాలో అవుతున్న కొత్త పద్ధతి ఇదిగో!

పొద్దున్నే లేస్తే మనం తినే ఇడ్లీ , దోశ , పూరి , బ్రెడ్ లతో మొదలుపెట్టి భోజనంలో తినే అన్నం , చపాతి , ఇక సాయంత్రంపూట స్నాక్స్ గా తినే సమోసాలు , బజ్జీలు , బర్గర్ , పిజ్జాలవరకు అన్నింటిలో ఎక్కువగా ఉండే ఏకైక పదార్థం ఏమిటో తెలుసా ? కార్బోహాడ్రేట్స్ ( పిండిపదార్థాలు ). ఇది మనం తీసుకునే ఆహారంలో 70 నుంచి 80 శాతం ఉంటోంది . ఇదే మన కొంప ముంచుతోందని , షుగర్ , బీపీ , ఒబేసిటీ , క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులకు కారణమవుతోందని తాజా అధ్యయనాలలో తేలింది . దీనితోపాటు - సంప్రదాయ వంటనూనెలు , నెయ్యి , వెన్న వంటి ఫ్యాట్స్ ( కొవ్వు పదార్థాలు ) తో కొలెస్టరాల్ పెరుగుతుందని ఇంతవరకూ నమ్ముతూ వస్తున్న సిద్ధాంతం కూడా పూర్తిగా తప్పని తెలియవచ్చింది . ఫ్యాట్స్ తినటం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుందన్నది అపోహమాత్రమేనని , వాటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని అంటున్నారు . ఈ తాజా అధ్యయనాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఒక కొత్త ప్రత్యామ్నాయ ఆహార విధానం ( డైట్ ఛేంజ్ ప్రోగ్రామ్ ) ఇప్పుడు ఏపీలోని విశాఖపట్నం , విజయవాడ ప్రాంతాలలో హల్ చల్ చేస్తోంది . దీనిని ఆచరించటంవలనసాధారణ వ్యక్తులకు ఆరోగ్యం ఎన్నోరెట్లు మెరుగవుతుండగా , షుగర్ , బీ

ఈ తిక్క పాలిటిక్స్‌కు లెక్క ఉందా?

మన తెలుగు చేగువేరా పవన్ కళ్యాణ్ తాను అమితంగా ప్రేమించే అన్న బాటవైపుగానే అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు… రాజకీయాలకుసంబంధించి. కేసీఆర్ పాలన బాగుందని, చంద్రబాబు పాలన బాగుందని చెప్పటంద్వారా పవన్ తెలుగు రాష్ట్రాలప్రజలకు… కనీసం తన పార్టీ కార్యకర్తలకైనా ఏమి సందేశం ఇస్తున్నారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇరువురు చంద్రుల పాలన బాగుంటే జనసేన అవసరం ఏమిటన్న విమర్శ బలంగా వినబడుతోంది. పవన్ కు తాను నడుపుతున్నది రాజకీయపార్టీనా, స్వచ్ఛందసేవాసంస్థ(ఎన్జీవో)నా అనేది స్పష్టత లేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జయప్రకాష్ నారాయణ 'లోక్ సత్తా' అనే స్వచ్ఛందసంస్థ పెట్టి దానిని రాజకీయపార్టీగా మార్చి విఫలమైతే, 'జనసేన' అనే రాజకీయపార్టీని పెట్టిన పవన్ దానిని స్వచ్ఛందసంస్థగా మారుస్తారా అన్న అనుమానం కలుగుతోంది. To Read Full Article, Click Here.